ఇరాన్‌లో కూలిన విమానం.. 66 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న ఓ విమానం మధ్య ఇరాన్‌లో కూలిపోయింది.

Last Updated : Feb 18, 2018, 04:36 PM IST
ఇరాన్‌లో కూలిన విమానం.. 66 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న ఓ విమానం మధ్య ఇరాన్‌లో కూలిపోయింది. సెమిరామ్ టౌన్ దగ్గర్లోని పర్వతప్రాంతంలో విమానం కూలినట్లు ఆ దేశ పౌరవిమానయాన వర్గాలు ధృవీకరించాయి. ప్రమాద సమయంలో విమానంలో 66 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో విమానంలో ఉన్న అంద‌రూ చ‌నిపోయిన‌ట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.

హెలికాఫ్టర్ల ద్వారా ప్రమదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ టీం బయలుదేరింది. పర్వత ప్రాంతంలో ప్రమాదస్థలం ఉంది. ఇక్కడికి అంబులెన్సులు పంపడం సాధ్యం కాదని ఇరాన్ అత్యవసర విభాగ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడారు.

Trending News