Iran Helicopter Crash live news: ఇరాన్‌లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో దేశాధ్యక్షుడితో పాటు విదేశాంగమంత్రి గల్లంతయ్యారు. అజర్ బైజాన్ సరిహద్దు నుంచి తిరిగి వస్తుండగా దట్టమైన పొగమంచు కారణంగా హెలీకాప్టర్ పర్వత ప్రాంతాల్లో కుప్పకూలిపోయినట్టు ఆదేశపు మీడియా స్పష్టం చేసింది. హెలీకాప్టర్ క్రాష్ అయిన ప్రాంతం ఇంకా కచ్చితంగా గుర్తించలేకపోయారు.
ఇరాన్ దేశపు సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ తరువాత అంతటి పవర్‌ఫుల్ నేతగా రెండోసారి అద్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దుల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ పర్వత ప్రాంతాల్లో కుప్పకులిపోయింది. అజర్ బైజాన్-ఇరాన్ ఉమ్మడి ప్రాజెక్టు క్విజ్ ఖలైసీ డ్యామ్ ప్రారంభించేందుకు అజర్ బైజాన్ వెళ్లి తిరిగొస్తున్న క్రమంలోఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా హెలీకాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే కారణంగా హెలీకాప్టర్ ఎక్కడ క్రాష్ అయిందనేది కచ్చితంగా గుర్తించలేకపోతున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
ఇరాన్ సెర్చ్ ఆపరేషన్‌లో సహాయపడుతున్న టర్కిష్ ద్రోన్ ఒకటి హెలీకాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాంతానికి రెస్క్యూ బృందాల్ని పంపించారు. టర్కిష్ ద్రోన్ గుర్తించిన ఆ ప్రాంతాన్ని తవాల్‌గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నట్టుగా టర్కీకు చెందిన ఆ ద్రోన్ గుర్తించింది.
AKINCI İHA, İran semalarında İran Cumhurbaşkanı Reisi ve heyetini arama kurtarma çalışmalarına destek veriyor https://t.co/ovXnx13UcY
— AA Canlı (@AACanli) May 19, 2024
మరోవైపు తమ ప్రియనేత ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఆయన ప్రాణాలతో బయటకు రావాలంటూ అందరూ ప్రార్ధించాలని ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ పిలుపునిచ్చింది. ఇబ్రహీం రైసీ క్షేమ సమాచారంపై మద్య ప్రాచ్య దేశాల్లో ఆందోళన నెలకొంది.
Also read: Iran President: కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. దేశ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook