Indonesia Volcano: ఇండోనేషియాలో సెమెరు అగ్నిపర్వతం బద్దలు..13 మంది మృతి..వీడియో వైరల్!

Indonesia Volcano Erupts: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మందికిపైగా గాయపడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 12:13 PM IST
  • జావా ద్వీపంలో సెమెరు అగ్నిపర్వతం బద్దలు
  • 13 మంది మృతి, 90 మందికిపైగా గాయాలు
  • ఉత్తర సులవేసిలో 6.2 తీవ్రతతో భూకంపం
Indonesia Volcano: ఇండోనేషియాలో సెమెరు అగ్నిపర్వతం బద్దలు..13 మంది మృతి..వీడియో వైరల్!

Indonesia Volcano Erupts: ఇండోనేషియా(Indonesia)లోని జావా ద్వీపం(Java island,)లో గల సెమెరు అగ్నిపర్వతం(Semeru volcano erupted) శనివారం బద్ధలైంది. దీంతో పెద్ద ఎత్తున బూడిద, తీవ్రమైన వేడి వెలువడం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా..98 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్‌ మైటిగేషన్‌ ఏజెన్సీ (బీఎన్‌పీబీ) అధికారి ఒకరు తెలిపారు. 

3600 మీటర్లు ఎత్తైన సెమెరు అగ్నిపర్వతం(Semeru volcano) బద్దలవ్వటంతో.. 40 వేల అడుగుల ఎత్తువరకు దట్టంగా పొగ, దుమ్ముధూళి అలుముకుంది. దీంతో భయాందోళనకు గురైన తూర్పు జావా ప్రాంతంలోని చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా..లుమాజాంగ్ జిల్లా(Lumajang)లో ఉన్న రెండు ప్రాంతాలను మలాంగ్ నగరంతో కలిపే బ్రిడ్జ్ తెగిపోయింది. చాలా భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. 

Also Read: Terror Attack: మాలిలో ఉగ్ర బీభత్సం-31 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

తూర్పు జావా ప్రాంతం(East Java province)లో చిక్కుకున్న మరికొంత మందిని బీఎన్‌పీబీ బృందాలు కాపాడాయి. సెమెరు విస్పోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి.  కాగా, ఇండోనేషియాలో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇండోనేషియా..‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు సంభవించటం, అగ్నిపర్వతాలు బద్దలవ్వటం సర్వసాధారణం. జనవరిలో కూడా సెమెరు బద్దలవగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 

ఉత్తర సులవేసిలో భూకంపం 

ఇండోనేషియాలో భూకంపం(Indonesia Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదైంది. ఉత్తర సులవేసి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం.. భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించలేదని పేర్కొన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News