Uk vaccination: అక్కడికి వెళితే..వ్యాక్సినేషన్ ఫ్రీగా చేస్తారా

Uk vaccination: ఎవరైనా సరే విదేశాలకు వెళ్లేది ఎందుకు..ఉద్యోగం కోసమో..చదువు కోసమో లేదా విహారయాత్రనో. కానీ ప్రత్యేకించి వ్యాక్సిన్ కోసం వెళ్లడం. అదే జరుగుతున్నట్టు కన్పిస్తోంది. అందరూ ఇప్పుడు ఆ దేశం వైపు చూస్తున్నారు..

Last Updated : Dec 8, 2020, 10:41 AM IST
  • బ్రిటన్ టూర్ ప్యాకేజ్ కోసం భారతీయుల ఎంక్వైరీ
  • కరోనా వ్యాక్సిన్ కోసం బ్రిటన్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న భారతీయులు
  • 3-4 రోజుల టూర్ ప్యాకేజ్ కోసం భారతీయుల ప్రయత్నాలు
Uk vaccination: అక్కడికి వెళితే..వ్యాక్సినేషన్ ఫ్రీగా చేస్తారా

Uk vaccination: ఎవరైనా సరే విదేశాలకు వెళ్లేది ఎందుకు..ఉద్యోగం కోసమో..చదువు కోసమో లేదా విహారయాత్రనో. కానీ ప్రత్యేకించి వ్యాక్సిన్ కోసం వెళ్లడం. అదే జరుగుతున్నట్టు కన్పిస్తోంది. అందరూ ఇప్పుడు ఆ దేశం వైపు చూస్తున్నారు..

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రానే వచ్చింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, జర్మనీకు చెందిన బయోన్టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌కు యూకే తొలిసారిగా ఆమోదించింది. ఫైజర్ కంపెనీ ( Pfizer company )తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారంలోగా యూకేకు వ్యాక్సిన్ పంపిణీ కానుంది. 

ప్రపంచంలో కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) అందించే తొలిదేశంగా బ్రిటన్ ప్రాచుర్యం పొందనుంది. వచ్చేవారంలో యూకేలో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చాలామంది భారతీయులు లండన్  వెళ్లడానికి సిద్ధమౌతున్నట్టు  తెలుస్తోంది. పలు ట్రావెల్ ఏజెన్సీలు దీనికోసం ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ( Britain tour package ) ని కూడా సిద్ధం చేస్తున్నాయట.

బ్రిటన్ వెళ్లి..కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనేది భారతీయల కోరిక. అందుకే ప్రత్యేకంగా 3-4 రోజుల ప్యాకేజ్ ల కోసం ట్రావెల్ ఏజెన్సీల్ని సంప్రదిస్తున్నారు. బ్రిటన్ ( Britain ) ప్రభుత్వం తలపెట్టిన వ్యాక్సినేషన్ కోసం కావల్సినన్ని వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేసుకుంటోంది. వాస్తవానికి బ్రిటన్ వెళ్లడానికి ఇది అనువైన సీజన్ కాకపోయినా..కేవలం కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది తొందరపాటు చర్యే అవుతుందని ఈజీ మై ట్రిప్ చెబుతోంది. ఎందుకంటే ఇండియాను వెళ్లేవారికి అంటే ఇతర దేశస్థులకు వ్యాక్సిన్ ఇస్తారనేది అనుమానమే. ఎప్పుడైనా సరే ముందు దేశీయలకు ఇచ్చిన తరువాతే మిగిలిన వారిని పరిగణిస్తారు. 

మరోవైపు యూకేలో నిబంధనలు పటిష్టంగా అమలవుతున్నాయి. విదేశాల్నించి వచ్చేవారు తప్పనిసరిగా వారం రోజుల క్వారెంటైన్ ( Quarantine ) లో ఉండాలని..తరువాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని..నెగెటివ్ వస్తేనే తిరిగేందుకు అనుమతిస్తున్నారు. Also read: CoronaVirus Vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం తొక్కిసలాట జరగొచ్చు: WHO వార్నింగ్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x