Bangladesh Formation: చరిత్రలో స్పెషల్ డే.. మన సైన్యం దెబ్బకు తోకమూడిచిన పాక్.. బంగ్లాదేశ్‌ ఏర్పడిన కథ

Bangladesh Independence Day: మన సైన్యం దెబ్బకు పాకిస్థాన్ సైనికులు తోకమూడిచారు. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం చేయలేక లొంగిపోయారు. మన దేశం యుద్ధంలోకి దిగడంతో ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. నేడు (డిసెంబర్ 16) బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పెషల్..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 07:53 AM IST
  • తూర్పు పాకిస్థాన్‌పై పశ్చిమ పాకిస్థాన్ దురాగాతాలు
  • భారత సైనికుల అసమానమైన ధైర్యసాహసాల కథ
  • 13 రోజులకే చేతులెత్తిసిన పాక్ సైన్యం
Bangladesh Formation: చరిత్రలో స్పెషల్ డే.. మన సైన్యం దెబ్బకు తోకమూడిచిన పాక్.. బంగ్లాదేశ్‌ ఏర్పడిన కథ

Bangladesh Independence Day: మన దేశం ఎప్పుడు కూడా పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుంది. తన సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కొనసాగిస్తూనే.. ఏ పొరుగు దేశాన్ని అణచివేయాలని లేదా తన భూభాగాన్ని విస్తరించాలని ఇప్పటివరకు ఎప్పుడు కోరుకోలేదు. అందుకే మన దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరు ఉంది. మన పొరుగు దేశాలకు కష్టమొస్తే.. ఒక అడుగు ముందుకేసి మేమున్నామంటూ మన దేశం ఎన్నోసార్లు చేయినందించింది. అదే సమయంలో ఏదైనా పొరుగు దేశం హద్దులు దాటి మన సహనాన్ని పరీక్షిస్తే.. మన కూడా దీటుగా సమాధానం ఇచ్చాం. 1971 నాటి విజయ గాథ.. భారత సైనికుల అసమానమైన ధైర్యసాహసాల కథ.. ఇది రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది.  

1971లో ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఫీల్డ్ మార్షల్ సామ్ హోర్ముస్జీ ఫ్రామ్‌జీ జమ్‌సెట్జీ మానేక్షా భారత సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఈ యుద్ధంలో మన దేశం పోరాడి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 1971లో మానెక్షా సమర్థ సైనిక నాయకత్వంలో జరిగిన యుద్ధంలో విజయం దేశానికి కొత్త విశ్వాసాన్ని ఇచ్చింది. ఆయన సేవలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి 1973 జనవరిలో ఆయనను ఫీల్డ్ మార్షల్‌గా నియమించారు. 

బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా..

మత ప్రాతిపదికన మన దేశం నుంచి విడిపోయి పశ్చిమ, తూర్పు పాకిస్థాన్‌గా ఏర్పడింది. ఇప్పుడున్న బంగ్లాదేశ్‌నే అప్పుడు తూర్పు పాకిస్థాన్ అని పిలిచేవారు. పాకిస్థాన్‌ పశ్చిమ పాకిస్థాన్‌గా ఉండేది. తూర్పు పాకిస్థాన్‌‌పై పశ్చిమ పాకిస్థాన్ క్రూరమైన దురాగతాలకు పాల్పడేది. మారణహోమం, అత్యాచారం, మానవ హక్కుల ఉల్లంఘనలలో పశ్చిమ పాకిస్థాన్ అన్ని హద్దులను దాటింది. ఆ సమయంలోనే భారతదేశం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో చేరింది. తూర్పు పాకిస్థాన్‌ నుంచి పశ్చిమ పాకిస్థాన్ అధికారాన్ని వదులుకునేంతలా మన దేశం ఓడించింది.

16 డిసెంబర్ 1971న భారత బలగాల ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం కారణంగా.. 24 సంవత్సరాలుగా అణచివేత, దురాగతాలకు గురవుతున్న అప్పటి తూర్పు పాకిస్థాన్‌లోని కోట్లాది మంది ప్రజలు విముక్తి పొందారు. అదేరోజు ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ రూపంలో కొత్త దేశం పుట్టింది. అప్పటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటుంది. విజయ్ దివస్ 1971లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకోవడమే కాకుండా బంగ్లాదేశ్ పుట్టిన కథను కూడా తెలియజేస్తుంది.

ఆ ఘటనతో మొత్తం మారిపోయింది..

1970లో జరిగిన పాకిస్థాన్ సాధారణ ఎన్నికలు బంగ్లాదేశ్ ఏర్పడ్డానికి ప్రధాన కారణం అయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలు పాకిస్థాన్ విచ్ఛిన్నతను నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో తూర్పు పాకిస్థాన్‌లో షేక్ ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది, అయితే పశ్చిమాన జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. తూర్పు పాకిస్థాన్‌లోని 169 సీట్లకు గాను ముజిబుర్ రెహమాన్ పార్టీకి 167 వచ్చాయి. 313 స్థానాలున్న పాకిస్థాన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముజీబ్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఓటమిని అంగీకరించడానికి భుట్టో నిరాకరించారు. దీనికి వ్యతిరేకంగా 1971 మార్చి 7న ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత బంగ్లా విమోచన యుద్ధం మొదలైంది. మొదట బంగ్లాదేశ్ ముక్తి వాహిని ఏర్పడింది. భారత్‌ను బంగ్లా సాయం కోరడంతో మన సైనికులు వీరోచితంగా పోరాడి యుద్ధంలో పాకిస్థాన్‌ను సైన్యాన్ని ఓడించారు. చివరకు 16 డిసెంబర్ 1971న కొత్త దేశం బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.

13 రోజులపాటు యుద్ధం

13 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో భారత సైన్యం పరాక్రమానికి.. పాకిస్థాన్ సైన్యం లొంగిపోయింది. 16 డిసెంబర్ 1971 సాయంత్రం 4.35 గంటలకు పాకిస్థాన్ లెఫ్టినెంట్ జనరల్ నియాజీ 93 వేల మంది సైనికులతో భారత సైన్యానికి లొంగిపోయారు. మన దేశ లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ముందు పత్రంపై సంతకం చేశాడు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు. దీంతో ప్రపంచ పటంలో కొత్త దేశం బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది. 1971లో బంగ్లాదేశ్ పుట్టుక ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సంఘటనలలో ఒకటిగా చెబుతారు.

Also Read: Cheapest Flight Tickets: రైలు టికెట్ ధరలోనే ఫ్లైట్ టికెట్స్

Also Read: Holidays 2023: 2023 సంవత్సరం సెలవుల్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, మొత్తం ఎన్నంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News