India: పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలి: భారత్

గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ (Gilgit-Baltistan) ప్రాంతానికి తాత్కాలిక ప్రొవెన్షియల్‌ ( provincial status) హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించిన కొన్నిగంటల్లోనే.. భారత్ (India) దీనిని తీవ్రంగా ఖండించింది.

Last Updated : Nov 2, 2020, 06:59 AM IST
India: పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలి: భారత్

India rejects pakistans status gilgit-baltistan: న్యూఢిల్లీ: గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ (Gilgit-Baltistan) ప్రాంతానికి తాత్కాలిక ప్రొవెన్షియల్‌ ( provincial status) హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించిన కొన్నిగంటల్లోనే.. భారత్ (India) దీనిని తీవ్రంగా ఖండించింది. ఈ చర్య భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నమేనంటూ భారత విదేశాంగశాఖ (Ministry of External Affairs) అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ పాకిస్తాన్‌ను హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌తోపాటు లడఖ్‌తోపాటు, గిల్గిత్, బాల్టిస్తాన్ మొత్తం ప్రాంతం కూడా భారత్‌లో అంతర్భాగమేనని అనురాగ్ శ్రీవాస్తవ (Spokesperson Anurag Srivastava) స్పష్టం చేశారు. చట్ట విరుద్దంగా.. బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై పాకిస్తాన్‌కు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు. Also read: Pawan Kalyan Movie Shooting: రంగంలోకి దిగిన వకీల్ సాబ్

గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతంలో ఏడు దశబ్దాలుగా మానవహక్కుల ఉల్లంఘన జరగుతుందని అనురాగ్ శ్రీవాస్తవ పాకిస్తాన్‌పై మండిపడ్డారు. దీంతోపాటు దోపిడీ చేసి స్వేచ్ఛను హరిస్తోందని.. అయితే ఇలాంటి దురాక్రమణల వల్ల ఈ ప్రాంతంలోని నిజాలను ఎవరూ దాచలేరని ఆయన పేర్కొన్నారు. భారతీయ భూభాగాల స్థితిని మార్చే బదులు.. వారి ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరించింది. Also read: Jammu kashmir: భద్రతదళాల విజయం, హిజ్బూల్ ఛీప్ సైఫుల్లా హతం

Also read: Yogi Adityanath: లవ్ జిహాద్‌ను సహించం.. వినకపోతే అంతిమయాత్రే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News