India-Canada Conflict: కెనడాకు వీసా సేవల్ని పునరుద్ఱరించిన ఇండియా, ఆ 4 కేటగరీలకే

India-Canada Conflict: విదేశీ ప్రయాణం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఆ దేశానికి వీసా సేవల్ని భారతదేశం పునరుద్ధరించింది. ఇకపై 4 కేటగరీల్లో ఆ దేశానికి వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2023, 01:08 PM IST
India-Canada Conflict: కెనడాకు వీసా సేవల్ని పునరుద్ఱరించిన ఇండియా, ఆ 4 కేటగరీలకే

India-Canada Conflict: ఇండియా - కెనడా సంక్షోభం నేపధ్యంలో గత కొద్దికాలంగా కెనడాకు వీసా సేవలు నిలిచిపోయాయి. కెనడా నుంచి వచ్చే  ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందుులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి కాస్త సద్దుమణగడంతో ఇండియా..కెనడాకు వీసా సేవల్ని పునరుద్ధరించింది. 

ఇండియా, కెనడా దేశాల మధ్య సంక్షోభం, దౌత్య సంబంధాలు చెడిపోవడంతో కెనడియన్లకు ఇండియా వీసా సేవల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడటంతో కెనడియన్లకు వీసా సౌకర్యం పునరుద్ధరించింది. నాలుగు కేటగరీల్లో కెనడా దేశస్థులు వీసాకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంట్రీ, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసా కేటగరీలున్నాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెక్యూరిటీ అంశాన్ని సమీక్షించిన తరువాత కొన్ని కేటగరీలకు వీసా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు కెనడాలోని భారత హై కమీషనర్ తెలిపారు. వీసా సేవలు పునరుద్ధరణ అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. 

వియన్నా ఒప్పందం ప్రకారం భారత దౌత్యాధికారులకు కెనడాలో రక్షణ కల్పిస్తే వీసా సేవల్ని పునరుద్ధరిస్తామని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదురోజు క్రితం స్పష్టం చేశారు. కెనడాలో దౌత్యాధికారులు పనిచేయడం సురక్షితం కాదనే కారణంతోనే వీసాలు నిలిపివేశామని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి కాస్త సద్దుమణగడంతో కొన్ని కేటగరీలకు మాత్రం వీసా సేవలు పునరుద్ధరించారు.

Also read: US Mass Shooting: అమెరికాలో భారీగా కాల్పులు.. 22 మంది మృతి.. నిందితుడు ఒక్కడే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News