Afghanistan: కాబూల్ లో భారత ఎంబసీ మూసివేత...పౌరుల తరలింపుపై ఉత్కంఠ!

Afghanistan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 17, 2021, 12:01 PM IST
  • కాబూల్ లో భారత ఎంబసీ మూసివేత
  • అప్ఘన్ లో 1,500 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా
  • పౌరుల తరలింపుపై ఉత్కంఠ
Afghanistan: కాబూల్ లో భారత ఎంబసీ మూసివేత...పౌరుల తరలింపుపై ఉత్కంఠ!

Afghanistan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆధీనంలోకి తెచ్చుకున్న నేపథ్యంలో..ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని(Indian Embassy) మూసివేస్తున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. 

అప్ఘన్ లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండటంతో...కాబుల్‌(kabul)లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను తక్షణమే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చీ(External Affairs Ministry Spokesperson Arindam Bagchi) ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వాయుసేన(Indian Airforce)కు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు. 120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో సి-17 విమానం కాబుల్‌ నుంచి భారత్(india) కు బయల్దేరింది. ఎంబసీకి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకొస్తున్నట్లు సమచారం. 

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ ఇకపై నో ఫ్లై జోన్, విమాన ప్రయాణం నిషిద్దం

భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్‌(Iran) గగనతలం నుంచి అఫ్గానిస్థాన్‌(Afghanistan)కు వెళ్లి మన దేశానికి చెందిన కొందరిని ఆదివారం రాత్రి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ ప్రభుత్వం విడుదల చేయలేదు. మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకున్న భారత పౌరుల(Indians)ను క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీరందరినీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ నడుమ ఉంచినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో వీరందరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు.

ఆగస్టు 5 నాటికి అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో అధికారులు సహా సుమారుగా 1,500 మంది భారతీయులు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీరిలో చాలా మంది బ్యాంకులు, ఐటీ సంస్థలు, నిర్మాణ సంస్థలు, ఆసుపత్రులు, ఎన్జీవో సంస్థలు, టెలికాం కంపెనీలు, సెక్యూరిటీ కంపెనీలు, యూనివర్శిటీలు, భారత ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టులు, ఐక్యరాజ్యసమితి అనుబంధ మిషన్‌లలో పనిచేస్తున్నారు.

Also Read:Ashraf Ghani: అశ్రఫ్ ఘనీ 4 కార్లు, హెలీక్యాప్టర్ నిండా డబ్బుతో పారిపోయాడా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News