అట్టుడుకుతున్న అమెరికా..!!

అగ్రరాజ్యం అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. అట్లాంటా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు కొత్త రగడ ప్రారంభమైంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తి చనిపోవడంతో ఆందోళనకారులు ఉద్యమబాట పట్టారు. దీంతో అమెరికా అంతటా ఈ ఉద్యమం వేళ్లూనుకుంది. 

Last Updated : May 31, 2020, 09:31 AM IST
అట్టుడుకుతున్న అమెరికా..!!

అగ్రరాజ్యం అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. అట్లాంటా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు కొత్త రగడ ప్రారంభమైంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తి చనిపోవడంతో ఆందోళనకారులు ఉద్యమబాట పట్టారు. దీంతో అమెరికా అంతటా ఈ ఉద్యమం వేళ్లూనుకుంది. 

అమెరికాలో  24 పట్టణాలు ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. న్యూయార్క్, ఓక్లాండ్, కాలిఫోర్నియా, అట్లాంటా పోర్ట్ లాండ్, ఒరేగాన్ పట్టణాల్లో హింసాత్మక  ఘటనలు చెలరేగాయి. చట్టాన్ని అతిక్రమించి ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ పోలీసు వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పెద్ద ఎత్తున వీధుల్లో ఆందోళనకు దిగారు. దుకాణాల్లో లూటీలు చేస్తున్నారు. దీంతో పరిస్థితి అంతా అదుపు తప్పింది. తక్షణమే ఆర్మీ రంగంలోకి దిగాలని ఆరు రాష్ట్రాల గవర్నర్లు కోరుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

అసలేం జరిగింది..?
మిన్నెపోలిస్ పట్టణంలో పోలీసుల కారణంగా జార్జ్ ఫ్లాయిడ్ అనే  ఓ వ్యక్తి   మృతి చెందాడు. ఓ పోలీసు అధికారి ఆయన గొంతుపై కాలు పెట్టి విపరీతంగా నొక్కాడు. దీంతో ఫ్లాయిడ్ ఊపిరాడక చనిపోయాడు. ఊపిరి ఆడడం లేదని.. కాలు  తీయాలని ఎంతగా  బతిమిలాడినా పోలీస్ ఆఫీసర్  పట్టించుకోలేదు. కొద్దిసేపట్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడిదే అమెరికా అంతటా ఉద్రిక్తలకు కారణమైంది. 

మరోవైపు ఆందోళనను చల్లార్చేందుకు చర్యలు  తీసుకోవాల్సిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అగ్నికి మరింత ఆజ్యం పోశారు. ఆందోళనలు వైట్ హౌజ్‌ను తాకడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు వైట్ హౌజ్ బయట ఉన్న ఆందోళనకారులను హెచ్చరించారు. సెక్యూరిటీ ఫెన్సింగ్ దాటితే విషపూరితమైన కుక్కలతో కరిపించేస్తానని ట్వీట్ చేశారు. అంతే నేను ఎప్పుడూ చూడని ఆయుధాలు ఆందోళనకారులు చూడాల్సి వస్తుందన్నారు.

మిన్నెపోలిస్ నుంచి ప్రారంభమైన ఉద్యమం క్రమక్రమంగా అమెరికా అంతటా విస్తరించింది. పౌరహక్కులను కాలరాస్తారా..? అంటూ ఉద్యమకారులు ఆందోళన చేస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీస్ ఆఫీసర్‌ను అరెస్టు చేసినా ఆందోళనలు చల్లారలేదు.  జార్జియాలో అత్యవసర  పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్ బ్రియాన్ క్యాంప్ ప్రకటించారు. శాంతి భద్రతల కోసం అదనంగా 500 మంది సెక్యురిటీ సిబ్బందిని నియమించారు. అటు, అట్లాంటా, పోర్ట్ లాండ్‌లోనూ కర్ఫ్యూ విధించారు. 

మరోవైపు  పోర్ట్ లాండ్‌లో ఉద్యమకారులు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. భవనాన్ని ధ్వంసం చేశారు. వర్జీనియాలోని రిచ్ మండ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉద్యమకారులు పోలీసుల వాహనాలు తగులబెట్టారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x