History Of National Flag: మన జాతీయ జండా చరిత్ర తెలుసా..? ఇవన్నీ మన జండాలే!

History Of Tiranga: ఈ ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు కావొస్తుంది. భారత్‌లో స్వతంత్యం వచ్చిన నాటి నుంచి  వివిధ మార్పులు చెందుతూ వచ్చింది. అయితే చాలా మంది పోరాటాల కారణంగానే బ్రిటిష్‌ల నుంచి  విముక్తి కలిగింది. ఇదే క్రమంలో దేశానికి గుర్తింపుగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.

Last Updated : Aug 5, 2022, 12:13 PM IST
  • మొదటి జెండా కలకత్తాలోని..
  • పార్సీ బగాన్ చౌక్ 1906 ఎగరవేశారు
  • 22 జూలై 1947 త్రివర్ణ పతాకం ఏర్పడింది
History Of National Flag: మన జాతీయ జండా చరిత్ర తెలుసా..? ఇవన్నీ మన జండాలే!

History Of Tiranga: ఈ ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు కావొస్తుంది. భారత్‌లో స్వతంత్యం వచ్చిన నాటి నుంచి  వివిధ మార్పులు చెందుతూ వచ్చింది. అయితే చాలా మంది పోరాటాల కారణంగానే బ్రిటిష్‌ల నుంచి  విముక్తి కలిగింది. ఇదే క్రమంలో దేశానికి గుర్తింపుగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ త్రివర్ణ పతాకంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. ఆ తర్వాత భారతీయ జెండా త్రివర్ణ పతాకం రూపం దాల్చుకుంది. అయితే భారతదేశ జెండా అన్ని దేశాల పతాకాలకు భిన్నంగా ఉండడం విశేషం. నాడు భారతీయ జెండాలో చాలా రంగులున్నప్పటికీ వివిధ రకాలుగా రూపాంతరాలు చెంది త్రివర్ణ పతాకంగా ఏర్పడింది.

మొదటగా పార్సీ బగాన్ చౌక్ (కలకత్తా)లో 1906 ఆగస్టు 7న భారత పతాకాన్ని నింగిలోకి ఎగురవేశారు. ఎరుపు, పసుపు , ఆకుపచ్చ(Red, yellow, green) రంగులను కలిగి ఉన్న ఈ జెండా మూడు రకాల సమాన గీతలతో కలిగి ఉంటుంది. ఈ జెండాలోని మొదటి రంగుగా ఆకు పచ్చని రంగు కలిగి ఉండి ఆ తర్వాత పసుపు, ఎరుపు రంగులు ఉండేవి. అంతేకాకుండా  తామరపూలు, చంద్రుడు, సూర్యుడు గుర్తులుగా ఉండేవి.

మొదటి జెండా(1906):

కలకత్తాలోని పార్సీ బగాన్ చౌక్ (కలకత్తా)లో 1906 ఆగస్టు 7న భారత పతాకాన్ని నింగిలోకి ఎగురవేశారు. ఈ జెండాలో మూడు రకాల రంగులు ఉండేవి అందులో ఆకు పచ్చని రంగు ముందుంటే.. ఆ తర్వాత  పసుపు, ఎరుపు రంగులుండేవి. అంతేకాకుండా మానవ వనుగడకు సంబంధించిన గుర్తులు కూడా ఉండేవి.

రెండవ జెండా:

రెండవ జెండాను కొంతమంది భారతీయ విప్లవ కారులు పారిస్‌లోని ఎగురవేశారు. ఇది కలకత్తాలో వినియోగించిన జెండాల ఉండేది. కాకపోతే ఈ జెండాలో కేవలం ఒకే కమలం ఉండేదటా. అయితే ఈ జెండాను మేడమ్ కామా.. పలువురు విప్లవ కారులు ఎగరవేసారని సమాచారంత.

మూడవ జెండా( 1917 ):

ఆ తర్వాత భారత్‌లోనే మూడవ జెండాను 1917 సంవత్సరంలో రూపొందిచారు. అయితే పతాకాన్ని మొదటగా డాక్టర్ అన్నీ బిసెంట్, లోకమాన్య తిలక్ ఎగరవేశారు. అయితే ఈ జెండాలో మాత్రం ఐదు ఎరుపు రంగు గీతాలు, నాలుగు ఆకు పట్ట గీతలు ఉండేవని సమాచారం. అయితే ఇందులో ఏడు నక్షత్రాలు కూడా ఉండేవని సమాచారం.

నాల్గవ జెండా(1921):

నాల్గవ జెండాను ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు జెండాను తయారు చేసి గాంధీకి ఇచ్చారని పలు వార్త సంస్థలు తెలిపాయి. అయితే ఈ నాలుగవ జెండాను  అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో భాగంగా ఇచ్చినట్లు సమాచారం. ఈ పతాకాన్ని 1921లో బెజవాడలో వెలుగులోకి వచ్చింది. ఈ జెండా రెండు రంగులు మాత్రమే ఉండేది. ఆ తర్వాత పలు రకాల మార్పులు వచ్చాయి.

ఐదవ జెండా(1921):

1921 తర్వాత ఐదవ జెండా వచ్చినట్లు సమాచారం. ఇది మన ప్రస్తుతం ఉన్న జెండాకు దగ్గరగా ఉండేది. ఇందులో అశోక చక్రానికి మినహాయింపుగా స్పిన్నింగ్ వీల్ ఉండేది.

త్రివర్ణ పతాకం ప్రారంభం(1947):

ప్రస్తుతం మనం వినియోగిస్తున్న పతాకాన్ని 22 జూలై 1947 (22 July 1947)న రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాగా ఆమోదించింది. ఈ మూడు రంగుల జెండా నేడు భారత ఉనికి చాటుతున్న జాతీయ జెండా.

Also read:India vs West Indies: బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న హార్దిక్ పాండ్యా..తాజాగా సరికొత్త రికార్డు..!

Also read:India vs West Indies: బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న హార్దిక్ పాండ్యా..తాజాగా సరికొత్త రికార్డు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News