Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో కుండపోత వర్షాలు.. వరదల్లో 33 మంది దుర్మరణం..

Afghanistan: మూడు రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు.  

Written by - Samala Srinivas | Last Updated : Apr 15, 2024, 01:57 PM IST
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో కుండపోత వర్షాలు.. వరదల్లో 33 మంది దుర్మరణం..

Afghanistan floods: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఆకస్మిక వరదల కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు. ఈ వరదలు కారణంగా 606 గృహాలు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ అన్నారు. 

ఈ వరదల వల్ల ఫరా, హెరాత్, జాబుల్ మరియు కాందహార్ ప్రావిన్స్‌లు అధిక నష్టాన్ని చవిచూశాయని సైక్ తెలిపారు. ఈ వర్షాలకు 200 పశువులు మృతి చెందగా.. 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా 85 కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతినాయి. ఆ దేశంలోని 34 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 

వరదలు, భూకంపాలు, హిమపాతాలు, కొండచరియలు విరిగిపడటం మరియు కరువుతో సహా ప్రకృతి వైపరీత్యాల వంటి ఎక్కువగా సంభవించే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. గత ఫిబ్రవరిలో ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్ లో భారీ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి 25 మంది మృత్యువాతపడ్డారు. మార్చిలో కురిసిన కుండపోత వర్షాలకు(Heavy rains in Afghanistan) 60 మంది ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్ దేశంలోని వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని యూఎన్ఓ గతేడాది హెచ్చరించింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణంగా పేర్కొంది. 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ దేశంలో విదేశీ సహాయం తగ్గిపోయింది. దీంతోప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read: Terror Attack: రంజాన్ నెలలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూకలు, 27 మంది మృతి

Also read: Taiwan Earthquake: అంత భారీ భూకంపం వచ్చినా 9 మందే మరణం, భూకంపాలకు దీటుగా తైవాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News