H1B Visa: ఐటీ ఉద్యోగులకు శుభవార్త, హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోవాలి

H1B Visa: భారతీయ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. హెచ్ 1 బీ వీసాల కోసం నిరీక్షించినవారికి శుభ పరిణామం. హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2021, 04:31 PM IST
H1B Visa: ఐటీ ఉద్యోగులకు శుభవార్త, హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోవాలి

H1B Visa: భారతీయ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. హెచ్ 1 బీ వీసాల కోసం నిరీక్షించినవారికి శుభ పరిణామం.హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

అమెరికాలో మళ్లీ హెచ్ 1 బీ వీసాల(H1B Visa)ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ (H1B Visa Registration)మార్చ్ 10 నుంచి అంటే నేటి నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పదిహేను రోజుల పాటు అంటే మార్చ్ 25 వరకూ కొనసాగనుందని యూఎస్ సీఐఎస్ ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్‌-1 బీ వీసాలు అందజేస్తామని, కంప్యూటర్‌ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఏప్రిల్ 1 నుండి దరఖాస్తులను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. హెచ్‌-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరడానికి వీలవుతుంది. 

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

ముందుగా దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్‌ అకౌంట్‌ క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవల్సిఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు అంటే 729 రూపాయలు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌‌లో వర్కర్‌‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందించాలి. ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులవుతారు.

Also read: Tirath Singh Rawat: Uttarakhand నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్, సాయంత్రం ప్రమాణ స్వీకారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News