పునాది కింద బంగారు నాణేల నిధి

థియేటర్ పునాది కింద బంగారు నాణేలు

Last Updated : Sep 10, 2018, 09:20 PM IST
పునాది కింద బంగారు నాణేల నిధి

ఇటలీలోని ఓ థియేటర్ అడుగు భాగంలో పునాది తవ్వుతున్న నిర్మాణ రంగం కార్మికులను అక్కడ వెలుగుచూసిన ఓ బంగారు నిధిని ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు ఉన్న ఓ జగ్గు ఈ పునాది తవ్వకాల్లో వెలుగుచూడటం ఇటలీలో సంచలనం సృష్టించింది. లభించినట్లు ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. తవ్వకాల్లో బయటపడ్డ ఓ రాతి పాత్రలో ఇవి లభించినట్లు పేర్కొంది. పాత థియేటర్‌ భవనాన్ని కూల్చేసి, అదే స్థానంలో మరో కొత్త భవనాన్ని నిర్మించేందుకు తవ్వకాలు జరుపుతుండగా ఈ నిధి బయటపడింది. ఈ బంగారు నాణేలన్నీ 5వ శతాబ్ధానికి చెందిన నాణేలుగా ఇటలీ పురాతత్వ శాఖ గుర్తించింది. 

ఈ బంగారు నాణేలు వెలుగుచూసిన విషయాన్ని ధృవీకరిస్తూ ఇటలీ సంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌లో పలు ఫొటోలను సైతం పోస్ట్ చేసింది. ఈ ఘటనపై ఇటలీ సంస్కృతిక శాఖ మంత్రి అల్బెర్టో బొనిసొలి మాట్లాడుతూ ‘ఈ బంగారు నాణేల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటో ఇంకా వివరంగా తెలియదు కానీ ఈ ప్రాంతం మన పురాతత్వానికి నిజమైన నిధి’ అని అన్నారు. ఇటలీ సంస్కృతిక మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Trending News