Viral Photo: కొన్ని రకాల వీడియోలు, ఫోటోలు తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ (Viral) అవుతుంటాయి. కొన్ని సంతోషపరిస్తే.. మరి కొన్ని షాక్ కు గురి చేస్తుంటాయి. ఇంటర్నెట్ లో ఎలాంటి వీడియో ఫోటోలు అయిన కారణం లేకుండా వైరల్ అవుతాయని మరో ఫోటో నిరూపించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్ లైన్ లో అన్ని.. నేర్చుకోవటం, ఫుడ్ ఆర్డర్, నిత్యావసర వస్తువుల కొనుగోలు.. ఇలా అన్నిటికి ఉన్న ఒకే ఒక మార్గం ఆన్ లైన్ (Online).
టీచర్ లను మోసం చేసిన అమ్మాయి...
ఆన్‌లైన్ క్లాస్‌ల్లో విద్యార్థులు చాలా సౌకర్యవంతంగా ఉండవచ్చు, కానీ కొంత మంది విద్యార్థులు దీనిని తప్పుదోవలో వాడుతున్నారు. ఒక అమ్మాయి ఆన్‌లైన్ క్లాస్ (Online Class) డుమ్మా కొట్టి, ఒక బొమ్మకు మాస్క్, విగ్ పెట్టి లాప్ టాప్ ముందు ఉంచి తను వెళ్లి బెడ్ పై పడుకునే ఒక ఫోటో ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది.
Also Read: IPL 2021: రేపటి నండే ఐపీఎల్ రెండోదశ... ఎంటర్టైన్మెంట్ షురు!
తరగతి గదిలో విద్యార్థులకు నిద్ర వచ్చిన వారు పక్కన ఉన్న పిల్లలను లేదా టీచర్ తిడతారన్న భయంతో పడుకోకుండా క్లాసులు వింటున్నట్టు నటిస్తారు. కానీ ఆన్ లైన్ క్లాసులో ఏకంగా ఒక డమ్మీ బొమ్మను ఉంచి క్లాసు చెప్తున్న టీచర్ నే కాదు ఇతర విద్యార్థులను ఫూల్ చేసింది.
Yo 😂 pic.twitter.com/u9R0fFq3r9
— Uncle Derrick (@derrickdmv) September 16, 2021
మంచం మీద పడుకున్న అమ్మాయి
ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఫోటోలో అమ్మాయి ఒక డమ్మీ బొమ్మకు మాస్క్, అద్దాలు తొడిగి, విగ్ పెట్టి లాప్ టాప్ మూడు పెట్టి పక్కన పడుకుంది. ఈ ఫోటోకు ఇప్పటివరకు 62.1K కంటే ఎక్కువ రీట్వీట్లు, 7392 వ్యాఖ్యలు మరియు 524.1K లైక్‌లు వచ్చాయి. "ఇంట్లో క్లాస్ సమయంలో మాస్క్ అవసరం ఏమిటి' అని ఒకరు కామెంట్ చేస్తే... "బ్రేవ్ గర్ల్" అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
చాలా మంది విద్యార్థులు ఇలా ఆన్‌లైన్ క్లాస్‌ల్లో టీచర్ లను మోసం చేస్తున్నారు. కావున మీ పిల్లలు అయిన సరిగా క్లాస్ వింటున్నారా? లేదా అని ఒకసారి check చేసుకోండి మరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి