Political Murders: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..కాల్చి చంపబడిన రాజకీయ నాయకులు వీరే..!

Political Murders: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఇలా కాల్చి చంపబడ్డారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 8, 2022, 07:56 PM IST
  • జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య
  • ఎన్నికల ప్రచారంలో ఘటన
  • కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పలువురు ప్రముఖులు
Political Murders: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..కాల్చి చంపబడిన రాజకీయ నాయకులు వీరే..!

Political Murders: జపాన్‌లోని నరాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విషాదం నెలకొంది. పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతున్న సమయంలో మాజీ ప్రధాని షింజో అబేపై దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరిపాడు. తుపాకీని నిందితుడు ఇంట్లో తయారు చేసినట్లు గుర్తించారు. కాల్పులు జరిపినట్లు భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

బెనజీర్ భుట్టో..

పాకిస్థాన్‌కు రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో 2007 డిసెంబర్‌ 27న హత్యకు గురయ్యారు. లియాఖత్ నేషనల్ బాగ్‌లో రాజకీయ ర్యాలీలో ఉన్న సమయంలో తుపాకులతో కాల్పులు జరిగాయి. అనంతరం ఆత్మాహుతి బాంబు పేల్చారు. ఈఘటనలో ఆమె మృతి చెందారు.

జాన్ ఎఫ్‌. కెన్నెడీ..


యునైటెడ్ స్టేట్స్‌ 35వ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్‌. కెన్నెడీపై ఇలాంటి దాడే జరిగింది. డల్లాస్‌లోని డిలి ప్లాజా మీదుగా అధికారిక వాహనంలో వెళ్తున్న సమయంలో దుండుగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన కెన్నెడీ, ఆయన భార్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  

అబ్రహం లింకన్..

యునైటెడ్ స్టేట్స్ 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌పై ఆయన సానుభూతి పరుడైన బూత్‌ చేత కాల్చి చంపబడ్డారు. లింకన్‌కు బుల్లెట్లు భారీగా తగలడంతో మృతి చెందారు.

మార్టిన్ లూథర్ కింగ్..

దిగ్గజ అమెరికన్ నేత, పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్‌పై 1968 ఏప్రిల్ 4న కాల్పులు చోటుచేసుకున్నాయి. మెంఫిన్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆయన స్పాట్‌లోని మృత్యువాత పడ్డారు.

భారత్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ఆ రాజకీయ నాయకులను ఇప్పుడు చూద్దాం..

ఇందిరా గాంధీ..

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కాల్చి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెపై సిక్కు అంగరక్షకులు కాల్పులకు దిగారు. ఈఘటనలో ఇందిరాగాంధీకి 30 బుల్లెట్లు తగిలాయి.

మహాత్మా గాంధీ..

భారత స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీపై కాల్పులు జరిగాయి. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్ కాంపౌండ్‌లో గాడ్సే అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈఘటనలో మహాత్మా గాంధీ అక్కడికక్కడే చనిపోయారు.

సిద్ధూ మూసేవాలా..

సినీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. ఈఏడాది మే 29న పంజాబ్‌లోని తన స్వగ్రామం సమీపంలో ఆయన కారుపై కాల్పులు జరిపారు. సిద్ధూ మూసేవాలా అక్కడికక్కడే మృతి చెందారు.

Also read: Raghu Rama Krishna Raju: తెలంగాణ హైకోర్టులో రఘురామ కృష్ణం రాజుకు షాక్..పిటిషన్‌ కొట్టివేత..!

Also read: Uddhav Thackeray: శివసేన పార్టీ, గుర్తు తమదే..శిండే ద్రోహం చేశారన్న ఉద్ధవ్ ఠాక్రే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News