కరోనా నిర్ధారణకు ( Covid19 test ) కొత్త రకం పరికరం అందుబాటులో రానుంది. ఇప్పటికే ఈ అధునాతన, అత్యంత చవకైన టెస్ట్ పరికరానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ( FDA ) ఆమోదం తెలిపింది.
కరోనా వైరస్ నిర్ధారణకు పలు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ఇందులో ఆర్టీ పీసీఆర్ ( RT-PCR ), ట్రూనాట్ ( Tru not ), ర్యాపిడ్ టెస్ట్ కిట్ ( Rapid test ) లు ముఖ్యమైనవి. ఇప్పుడు కొత్త రకం పరీక్ష కిట్ కు ఆమెరికాలోని ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్ డీ ఏ ( FDA ) ఆమోదం తెలిపింది. ప్రత్యేకమైన సాధనాలు లేకుండానే కరోనా ఇన్ ఫెక్షన్ ను నిర్ధారించే తొలి ర్యాపిడ్ టెస్ట్ ( First rapid test ) ఇదేనని తెలుస్తోంది. చిన్నసైజులో అంటే మీ క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుందీ కిట్. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే టెస్ట్ పూర్తవుతుంది. దీని ధరను 5 డాలర్లుగా నిర్ణయించారు. అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 3 వందల రూపాయలు. అమెరికన్ మార్కెట్ లో వస్తున్న సులభమైన, చవకైన విధానమిదే. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పరీక్షలు చేయడానికి ఈ టెస్ట్ పరికరం ఉపయోగపడుతుందంటున్నారు. ఈ కొత్త రకం టెస్ట్ కిట్ ను ఎబ్బాట్ లేబరేటరీస్ ( Abbott laboratories ) అబివృద్ధి చేసింది. Also read: Shinzo Abe: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే రాజినామా