Starship booster: అగ్రరాజ్యమైన అమెరికాలో అంతరిక్ష ప్రయోగాలలో మరో ఇంజనీరింగ్ అద్భుతం చోటు చేసుకుందని చెప్పాలి. రాకెట్ ను నింగిలోకి పంపించాక బూస్టర్ ను మళ్ళీ వినియోగించుకునేందుకు సహాయపడే కొత్తరకం సాంకేతికతను అంతరిక్షరంగ సంస్థ స్పేస్ ఎక్స్.. విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ తో పాటు నింగిలోకి తీసుకువెళ్లిన బూస్టర్ తిరిగి యధాస్థానానికి తిరిగి వచ్చిన ఘటనకు దక్షిణ టెక్సాస్ లోని స్టార్ బేస్ ప్రయోగ వేదిక ఉదాహరణగా నిలిచింది.
అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:25 గంటలకు ఈ స్టార్ షిప్ రాకెట్ ను ప్రయోగించగా రాకెట్ లోని 232 అడుగుల ఎత్తైన బూస్టర్ లాంఛ్ ప్యాడ్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ ను నింగిలోకి పంపించిన ఏడు నిమిషాల తర్వాత మళ్లీ లాంచ్ ప్యాడ్ కి వచ్చి చేరడంతో అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.
నిప్పులు కక్కుతూ తిరిగి వచ్చిన బూస్టర్ ను లాంచ్ లోని మెకానికల్ చాప్ స్టిక్ చేతులు ఒడిసి పట్టిన వీడియోని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు , సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ విజయోత్సవాన్ని ప్రకటించారు. రాకెట్ ను లాంచ్ టవర్ ఒడుపుగా పట్టేసుకుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ ఇందులో ఎలాంటి ఫిక్షన్ లేదు అంటూ ట్వీట్ చేశారు ఎలన్ మస్క్. ఇక ఈ ప్రయోగం సక్సెస్ అవడంతో స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు, ఆ సంస్థ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. అడ్మినిస్ట్రేటర్ సైతం వీళ్లకు ప్రత్యేకంగా అభినందనలు పంపించడం గమనార్హం. ఏకంగా 400 అడుగుల ఎత్తైన అత్యంత భారీ రాకెట్ కు సంబంధించిన బూస్టర్ ఇలా లాంచ్ ప్యాడ్ మీదకే తిరిగి చేరడం ఇదే తొలిసారి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
బూస్టర్ వల్ల నింగిలోకి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ను శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్రంలో నిర్దేశిత సముద్ర ప్రాంతంలో దించారు. ఇంజనీరింగ్ చరిత్ర పుస్తకాలలో లిఖించదగ్గ రోజు ఇదే అంటూ స్పేస్ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ కేట్ టైస్ ఆనందం వ్యక్తం చేస్తూ తమ సక్సెస్ను అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా తెలిపారు. వాస్తవానికి చిన్నపాటి ఫాల్కన్ -9 రాకెట్లకు వినియోగించిన స్పేస్ ఎక్స్.. ఫస్ట్ స్టేజి బూస్టర్లను గత తొమ్మిది సంవత్సరాలుగా స్టేజి ఎక్స్ వినియోగిస్తోంది. అందులో ఏవి కూడా మళ్లీ లాంచ్ ప్యాడ్ కు వచ్చి చేరుకోలేదు. క్యాప్సిల్స్ , క్రాఫ్ట్స్ నింగిలోకి తీసుకెళ్లాక ఫస్ట్ స్టేజి బూస్టర్లు సముద్రంలోని నిర్దేశిత ప్రాంతాలలో తేలియాడే తలాలపై క్షేమంగా ల్యాండ్ అయ్యేవి. లేదంటే లాంచ్ ప్యాడ్ కు 7 మైళ్ళ దూరంలో కాంక్రీట్ స్లాబులపైన ల్యాండ్ అయ్యేవి. అయితే ఇలా మొదటిసారి తిరిగి లాంచ్ ప్యాడ్ కు రావడం తొలిసారి దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే దశాబ్ది చివరికల్లా చంద్రుడి మీదకు వ్యోమగాములను తరలించేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు సమాచారం.
Mechazilla has caught the Super Heavy booster! pic.twitter.com/6R5YatSVJX
— SpaceX (@SpaceX) October 13, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter