Earthquake: నేపాల్ లో భూకంపం సంభవించింది. నేపాల్ రాజధాని ఖాట్మండులో భూమి కంపించింది. భూకంప తీవ్రత 5.5గా రికార్డ్ స్కేల్ పై నమోదైంది. ఖాట్మండులో ఆదివారం ఉదయం 7.58 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. భూకంప కేంద్రం ఖాట్మండుకు ఆగ్నేయంగా 147 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు చెప్పారు. నేపాల్ వచ్చిన భూప్రకంపనల ప్రభావం నేపాల్ లోనూ కనపించింది. బీహార్‌లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. బీహార్ రాజధాని పాట్నాతో పాటు సహర్సా, పూర్నియా, మాధేపురా, కతిహార్, అరారియా, దర్భంగా, మధుబని, సీతామర్హి మరియు మోతిహారి సహా పలు జిల్లాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Earthquake tremors felt in Kathmandu, Nepal
An earthquake of magnitude 5.5 on the Richter scale occurred 147 km east-southeast of Kathmandu, Nepal at 0758 hours: National Center for Seismology
— ANI (@ANI) July 31, 2022
భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భయంలో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కాసేపటి వరకు రోడ్లపైనే నిల్చున్నారు. బీహార్ లోని పలు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించిందని స్థానిక అధికారులు తెలిపారు.
Read also: Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా?
Read also:Cash In MLA Car:కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో భారీగా కరెన్సీ కట్టలు! ప్రభుత్వాన్ని పడగొట్టడానికేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook