Turkey-Syria Earthquake: 30 వేలకు చేరువలో భూకంప మృతుల సంఖ్య..!

Turkey-Syria Earthquake: తుర్కియే, సిరియాల్లో ఏర్పడిన భూకంపం మృతుల సంఖ్య 28వేలు దాటింది. ఇందులో 24వేల మందికిపైగా తుర్కియేలోనే చనిపోయారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 12:39 PM IST
Turkey-Syria Earthquake: 30 వేలకు చేరువలో భూకంప మృతుల సంఖ్య..!

Turkey-Syria Earthquake Death Toll: తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. భూకంప మృతుల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. ప్రస్తుతం మరణాల సంఖ్య 29,896గా ఉంది. తమ దేశంలో భూకంప మరణాల సంఖ్య 24,617గా ఉందని తుర్కియే వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే తెలిపారు. మెుత్తం 80,278 మంది గాయపడినట్లు చెప్పారు. సిరియాలో మెుత్తం మరణాల సంఖ్య 5,279గా ఉన్నట్లు వైట్ హెల్మెట్స్ సివిల్ డిఫెన్స్ గ్రూప్ తెలిపింది. ఇందులో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న వాయువ్య సిరియాలో 2,167 మంది ఉన్నారు. 

ఇదిలావుండగా, ఫిబ్రవరి 6న టర్కీలో భూకంపం సంభవించినప్పటి నుంచి తప్పిపోయిన భారతీయుడు మాలత్యాలోని ఓ హోటల్ శిథిలాల కింద చనిపోయాడని టర్కీలోని భారత రాయబార కార్యాలయం శనివారం ట్వీట్‌ చేసింది. మృతుడు విజయ్ కుమార్‌గా గుర్తించబడ్డాడు. ఇతడు ఉత్తరాఖండ్ పౌడీ జిల్లా వాసి. అతను వ్యాపార నిమిత్తం తుర్కియేకి వెళ్లాడు. విజయ్ మరణవార్ విని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అతనికి తల్లి, భార్య, ఆరేళ్ల పాప ఉన్నారు. నెలన్నర క్రితం తండ్రిని కోల్పోయాడు. 

ఆపరేషన్ దోస్త్ లో భాగంగా.. మందులు, వైద్య సామాగ్రితో కూడిన ఏడో విమానం శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరి తుర్కియేకి వెళ్లింది. ఇప్పటికే భారత సైన్యానికి చెందిన 99 మంది వైద్యులు తుర్కియేలో గాయపడినవారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 

Also Read: Syria earthquake: కన్నీళ్లు పెట్టిస్తున్న సిరియన్ బాలిక ఫోటో.. రక్త సంబంధం అంటే ఇదేనేమో.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News