Donald Trump: బైడెన్ అంత చెత్త అభ్యర్థి ఇంకొకరు లేరు: ట్రంప్

American Presidential Candidate | అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నవంబర్ 3వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు అయిన డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump), బైడెన్ ప్రతీ వేదికపై ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు.

Last Updated : Oct 31, 2020, 05:20 PM IST
    • రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఫ్లోరిడాలోని తాంపాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
    • ఈ ర్యాలీలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను ఘాటుగా విమర్శించాడు ట్రంప్.
Donald Trump: బైడెన్ అంత చెత్త అభ్యర్థి ఇంకొకరు లేరు: ట్రంప్

American Presidential Elections | అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నవంబర్ 3వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు అయిన డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump), బైడెన్ ప్రతీ వేదికపై ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఫ్లోరిడాలోని తాంపాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను ఘాటుగా విమర్శించాడు ట్రంప్.

Also Read | Rythu Vedika: రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (Joe Biden ) అభ్యర్థిగా ప్రకటించడం అనేది అతి చెత్త నిర్ణయం అని.. బైడెన్ అతి చెత్త అభ్యర్థి అని విమర్శించాడు ట్రంప్.  అదే సమయంలో బైడెన్ చెప్పింది నమ్మి అతనికి ఓటు వేస్తే అమెరికా మరో వెనిజులా అవుతుంది అని..పరిస్థితి దారుణంగా మారుతుంది అన్నాడు ట్రంప్.

Also Read  |  ANGRAU Admissions 2020: ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్

అమెరికా ( USA) అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపిక అయితే అమెరికా కథ వెనిజులా లాగే ముగుస్తుంది అని .. అందులో సందేహం లేదన్ని ప్రజలను హెచ్చరించాడు ట్రంప్. అయితే తను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అమెరికాను సోషలిస్ట్ దేశంగా మారనివ్వను అని స్పష్టం చేశాడు ట్రంప్. అయితే గెలుపు ఓటముల వల్ల తనకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం లేదు అని వ్యాఖ్యానించాడు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News