అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ మైక్ పొంపెయోను నియమించారు. సీఐఏ డైరెక్టర్‌గా గినా హాస్పెల్‌ను నియమించారు. ట్రంప్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. సీఐఏ డైరెక్టర్ మైక్ పొంపెయో సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవిని అద్భుతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. రెక్స్ టిల్లర్‌సన్ చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. సీఐఏ డైరెక్టర్‌గా గినా హాస్పెల్‌ను నియమిస్తున్నట్లు, ఈ పదవికి ఎంపికైన తొలి మహిళ ఆమేనని పేర్కొన్నారు.
Mike Pompeo, Director of the CIA, will become our new Secretary of State. He will do a fantastic job! Thank you to Rex Tillerson for his service! Gina Haspel will become the new Director of the CIA, and the first woman so chosen. Congratulations to all!
— Donald J. Trump (@realDonaldTrump) March 13, 2018
ఏపీ యొక్క నివేదికల ప్రకారం, ట్రంప్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్‌నుఎందుకు తొలగిస్తున్నారో కారణాన్ని వెల్లడించలేదు. కానీ.. టిల్లర్‌సన్ పదవిలో ఉండాలని కోరుకున్నారట. ట్రంప్ గత శుక్రవారమే పదవి నుండి వైదొలగాలని టిల్లర్‌ను అడిగారని నివేదించింది.