కుక్కలతో 'కరోనా' నిర్ధారణ పరీక్ష..?

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యుకేళీ ఆడుతోంది. వైరస్ మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.

Last Updated : Apr 30, 2020, 11:11 AM IST
కుక్కలతో 'కరోనా' నిర్ధారణ పరీక్ష..?

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యుకేళీ ఆడుతోంది. వైరస్ మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.

కరోనా వైరస్ సోకినా. . 14 రోజుల వరకు లక్షణాలు బయటపడడం లేదు. పైగా లక్షణాలు లేని కరోనా వైరస్ జనాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా కష్టమవుతున్నాయి. ఎన్ని టెస్టింగ్ కిట్లయినా సరిపోవడం లేదు. అంతేకాదు కరోనా వైరస్ నిర్ధారణ కోసం ఉపయోగించే కిట్లు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతోంది. దీంతో అగ్రరాజ్యం అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్(UK) కొత్త రకంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలపై పరిశోధనలు చేస్తున్నాయి.  

కుక్కలతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి ఇరు దేశాలు. అవును మీరు చదివినింది నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. కుక్కల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా స్పందించే శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వాటికి ఆ రకమైన శిక్షణ ఇచ్చేందుకు ఇరు  దేశాల్లో పరిశోధకులు, శిక్షకులు  ప్రయత్నిస్తున్నారు. 

ఇదే అంశంపై అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. పెన్సిల్వేనియా యూనివర్శిటీలో లాబ్రేడార్ రిట్రీవరస్ జాతికి చెందిన  8  కుక్కులకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ రోగుల నుంచి వచ్చే వైరస్ వాసనను అవి పసిగట్టలవా..? లేదా..? వాటికి అలాంటి సామర్థ్యం ఉందా..? అనే దానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కూడా గతంలో ఇలాంటి పరీక్షలు నిర్వహించింది. అంతేకాదు మనుషుల్లో మలేరియా లక్షణాలు ఉన్న రోగులను కుక్కలు గుర్తిస్తాయని తెలిపింది. 

'కరోనా' కరాళ నృత్యం..!!

ఒకవేళ కుక్కలు ప్రాథమిక కరోనా వైరస్‌ను నిర్ధారించగలిగితే.. ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. ఫలితంగా పోలీసులతోపాటు కుక్కలు కూడా కరోనా వైరస్ పాజిటివ్ రోగుల కోసం అన్వేషిస్తాయి. విమానాశ్రయాలు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రుల్లో కుక్కలు కూడా సేవలు అందించే అవకాశం ఉంటుంది. 

కరోనా వైరస్‌ను వాసన ద్వారా కుక్కలు పసిగట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. గతంలో SAARS Cov- 2తోపాటు డ్రగ్స్, మారణాయుధాలు, మలేరియా ఇన్ఫెక్షన్లు, కేన్సర్లను గతంలో గుర్తించాయంటున్నారు. వైరస్‌లకు ప్రత్యేకమైన వాసన   ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాటి వాసనను కుక్కలు గుర్తించగలుగుతాయంటున్నారు.  

ఒకవేళ కుక్కలు వాసనతో కరోనా వైరస్ పాజిటివ్ రోగులను పసిగట్టగలిగితే.. ఒకే ఒక్క కుక్క గంటకు 250 మంది వరకు పరీక్షించగలదని శిక్షకులు చెబుతున్నారు. ఫలితంగా ఎయిర్ పోర్టులు, పోర్టులు, వ్యాపారసముదాయాల వద్ద వీటిని ఉపయోగిస్తే ఫలితం ఉంటుందని.. ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు.  

ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ రోగుల నుంచి సేకరించిన మూత్రం, లాలాజలం ద్వారా కుక్కలకు శిక్షణ ఇచ్చేందు కు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత రోగులు నిలబడి ఉన్నా .. వారి దగ్గర నుంచి వచ్చే వాసన ద్వారా కుక్కలు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేలా ప్రయత్నిస్తామని చెబుతున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News