అమెరికాను 2020 కరోనావైరస్‌తో మాత్రమే విడిచిపెట్టేలా లేదు. కరోనావైరస్ ( Coronavirus ) సమస్య ఇంకా విడిచిపెట్టనే లేదు తాజాగా టెక్సాస్‌లోని లేక్ జాక్సన్ సిటీలోని పబ్లిక్ ట్యాప్ నీళ్లలో కంటికి కనిపించని మెదడుని తినేసే నేగ్లేరియా ఫోలెరి ( Naegleria fowleri ) అనే ప్రాణాంతకమైన సూక్ష్మజీవులు ( Microbes in tap water ) ఉన్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ఈ సూక్ష్మజీవులు కారణంగానే ఓ ఆరేళ్ల బాలుడు చనిపోయినట్టు తెలియడంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే మునిసిపల్ అధికారులు 11 చోట్ల శాంపిల్స్‌ని సేకరించి పరిశీలించగా.. అందులో మూడు చోట్ల నల్లా నీళ్లలో ప్రాణాంతకమైన నేగ్లేరియా ఫోలెరి అనే అమీబా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టెక్సాస్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ కమిషన్.. ''లేక్ జాక్సన్, ఫ్రీపోర్ట్, యాంగిల్టన్, బ్రెజోరియా, రిచ్‌ఉడ్, ఓయ్‌స్టర్ క్రీక్, క్లూట్, రొజెన్‌బర్గ్, డో కెమికల్, టిడిసిజె క్లెమెన్స్, టిడిసీజే వేన్ స్కాట్ వంటి పట్టణాల్లో నల్లా నీటిని వినియోగించొద్దు'' అని పేర్కొంటూ హెచ్చరిక ప్రకటనలు విడుదల చేశాయి. Also read : MI VS RCB match news: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?
The Brazosport Water Authority is issuing a Do Not Use Advisory for all water in the following cities: Lake Jackson, Freeport, Angleton, Brazoria, Richwood, Oyster Creek, Clute, Rosenburg, Dow Chemical, TDCJ Clemens and TDCJ Wayne Scott. pic.twitter.com/PWp95dXdrE
— Texas Commission on Environmental Quality (@TCEQ) September 26, 2020
కంటికి కనిపించని ఈ సూక్ష్మ జీవి పేరే నేగ్లేరియా ఫోలెరి. గతంలోనూ నేగ్లెరియా ఫోలెరితో పలువురు చనిపోయారని టెక్సాస్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ కమిషన్ తెలిపింది. 2011-2013 మధ్య కాలంలో ఈ నేగ్లెరియా పోలెరితో తొలి మరణం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Naegleria fowleri infections symptoms : ఈ సూక్ష్మజీవులతో వచ్చే వ్యాధి ఏంటి ? లక్షణాలు ఎలా ఉంటాయి ?
కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనిషిలోకి ప్రవేశించే ఈ సూక్ష్మ జీవులు క్రమక్రమంగా మెదడుకు వ్యాపిస్తాయి. తద్వారా సోకే వ్యాధినే ప్రైమరి అమేబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ( primary amebic meningoencephalitis ) అని పిలుస్తారు. Also read : TikTok and Trump: నిషేధంపై ట్రంప్ ప్రభుత్వానికి మళ్లీ ఎదురుదెబ్బ
అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( CDC ) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మూర్ఛ, వాంతులు, నిద్ర, వికారం, ఏవేవో భ్రాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకి అనారోగ్యానికి గురైన వారంలోనే మరణిస్తారని సీడిసి తెలిపింది.
నివారణ చర్యలు ఏంటి ?
ప్రస్తుతం నిల్వ ఉన్న నీరుని వృధాగా పోనిచ్చి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ శాంపిల్స్ పరీక్షించి, అందులో సూక్ష్మీ జీవులు లేవు అని నిర్ధారణ అయ్యే వరకు నల్లా నీళ్లను వినియోగించరాదని అధికారులు పౌరులను హెచ్చరించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీటిని బాగా మరగబెట్టిన తర్వాతే వాడుకోవాలని, స్నానం చేసేటప్పుడు, ముఖం కడుక్కునేటప్పుడు ముక్కు లోపలికి నీరు పోకుండా జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సూక్ష్మజీవుల బారినపడే సమస్య అధికంగా ఉందని అధికారులు పౌరులకు హెచ్చరించారు. Also read : CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe