Covid19 Update: కరోనా మహమ్మారి నియంత్రణకై కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు కరోనా సంక్రమణ మాత్రం ఆగడం లేదు. రెండేళ్లలో కోవిడ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకు చేరుకున్నాయంటే ఆశ్చర్యంగా ఉందా..కానీ నిజమే
చైనాలోని వుహాన్ (Wuhan)నగరం నుంచి ప్రారంభమైన కరోనా వైరస్ (Coronavirus)ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. సెకండ్, థర్డ్‌వేవ్, ఫోర్త్‌వేవ్‌లతో విలవిల్లాడుతున్నాయి. 2019 నవంబర్ నెలలోనే వుహాన్ నుంచి కరోనా వైరస్ సంక్రమణ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు బ్రిటన్ దేశం ఇటీవల మందుల్ని కూడా ప్రవేశపెట్టింది. అటు ప్రజల్లో సైతం కోవిడ్‌పై అవగాహన పెరిగింది. రెండేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 25 కోట్లకు చేరుకుని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అన్ని దేశాలు రవాణా ఆంక్షల్ని సడలిస్తున్న నేపథ్యంలో తాజాగా పలుచోట్ల కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కల్గిస్తోంది. రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు ఈ మధ్య కాలంలో విజృంభిస్తున్నాయి. జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య దాదాపుగా 25.5 కోట్లకు చేరుకుంది. కోవిడ్ బాధితుల మరణాలు 50.05 లక్షలు దాటేశాయి.
ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, గ్రీస్, జర్మనీ కరోనా హాట్‌స్పాట్‌లుగా(Corona Hotspots) మారాయి. రష్యాలో రోజుకి 35 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఉక్రెయిన్‌లో 24 గంట్లోనే 833 మంది మృత్యువాతపడ్డారు. అయితే తాజా కేసుల్లో అత్యధిక మందిలో లక్షణాలు లేకపోవడం, వైరస్ లోడు తక్కువగా ఉండడం, ఆస్పత్రి అవసరం లేకుండానే తగ్గిపోవడమనేది కాస్త ఊరటనిస్తోంది. వరల్డ్ ఇన్‌డేటా ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఒక్క డోస్ కూడా ఇవ్వలేదు. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine)తీసుకోకపోతే ఐసీయూలో చేరడం, లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 16 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఆస్ట్రేలియా చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు యూరప్ దేశాల నుంచే వస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 10 లక్షల కేసులు యూరప్‌లో నమోదయ్యాయి. అమెరికాలోఇప్పటివరకు మొత్తం 4.65 కోట్ల కేసులు నమోదయ్యాయి. మొదటి 5 కోట్ల కేసులు నమోదవడానికి ఏడాది సమయం పడితే అప్పట్నించి ప్రతి మూడు నెలలకి 5 కోట్ల కేసులు నమోదవుతున్నాంటే సంక్రమణ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా కేసులు తగ్గకపోవడానికి డెల్టా వేరియెంట్(Delta Variant) విజృంభణే కారణంగా ఉంది.
Also read: Covaxin Approval: కోవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్టు ప్రకటించిన యూకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook