Coronavirus in Dharamsala: ఏడాది తరువాత పంజా విసురుతోన్న కరోనా వైరస్, 150 మంది సాధువులకు పాజిటివ్

Coronavirus in Dharamsala: కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. సరిగ్గా ఏడాది తరువాత ప్రకోపం చూపిస్తోంది. ధర్మశాలలోని 150 మంది బౌద్ధ సాధువులకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కల్గిస్తోంది. ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2021, 01:39 PM IST
Coronavirus in Dharamsala: ఏడాది తరువాత పంజా విసురుతోన్న కరోనా వైరస్,  150 మంది సాధువులకు పాజిటివ్

Coronavirus in Dharamsala: కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. సరిగ్గా ఏడాది తరువాత ప్రకోపం చూపిస్తోంది. ధర్మశాలలోని 150 మంది బౌద్ధ సాధువులకు కరోనా వైరస్ సోకడం ఆందోళన కల్గిస్తోంది. ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్(Coronavirus)మళ్లీ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సహా డిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్(Himachal pradesh)రాష్ట్రంలో వెలుగు చూసిన ఘటన కలకలం కల్గిస్తోంది. రాష్ట్రంలోని కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో బౌద్ధ ఆశ్రమం ( Budh Ashram)లో ఏకంగా 150 మంది బౌద్ధ సాధువులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కల్గిస్తోంది. ఫిబ్రవరి 18వ  తేదీన టిబెటన్ కొత్త ఏడాది పురస్కరించుకుని బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. ఈ క్రమంంలో బౌద్ధ ఆశ్రమంలో 20 మందికి కరోనా వైరస్ సోకడంతో..అప్రమత్తమైన అధికారులు  330 మంది సాధువులకు (Budhist monks) పరీక్షలు నిర్వహించారు. వీరిలో 154 మందికి పాజిటివ్‌గా తేలింది. కేవలం 8 రోజుల వ్యవధిలో 154 మంది కరోనా బారిన పడటంతో  గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్(Containment zone)‌గా ప్రకటించారు. 

వేడుకలకు కర్నాటక, ఢిల్లీ ప్రాంతాల్నించి ఫిబ్రవరి 23వ తేదిన 15 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. మరోవైపు కరోనా సోకిన సాధువుల్లో పైకి మాత్రం ఎటువంటి లక్షణాలు కన్పించలేదు. బయట ప్రాంతాల్నించి వచ్చినవారికి మాత్రం నెగెటివ్‌గా తేలింది. ఒకరి పరిస్థితి విషమించడంతో సమీపంలోని తాండ మెడికల్ కళాశాలకు తరలించారు. ధర్మశాల(Dharamsala)లోని కరోనా వైరస్ వ్యాపించిన ఆశ్రమానికి సీలు వేసినట్టు సబ్ కలెక్టర్ తెలిపారు. సరిగ్గా ఏడాది తరువాత కరోనా వైరస్ సమూహాలుగా టార్గెట్ చేయడం కలకలం కల్గిస్తోంది. 

Also read: Stop sale of Bikinis: ఆ బికినీల అమ్మకాల్ని నిలిపివేయాల్సిందే: ఆమెజాన్‌ను కోరిన శ్రీలంక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News