ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో మరిన్ని ప్రాణాలు బలిగొంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మృతుల సంఖ్య 213కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. చైనాతో పాటు అంతర్జాతీయంగా తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాణాంతక వైరస్ కారణంగా రోజురోజుకూ మరణాలు సంఖ్య పెరగుతుండటంతో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ (అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి) ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ పిలుపునిచ్చారు.
Also Read: భారత్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు
చైనాతో పాటు ఇతర దేశాలు సైతం అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరించింది. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుపట్టింది. నిషేధాలతో తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుందని అభిప్రాయపడింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 9816 మందికి కరోనా వైరస్ వైరస్ వ్యాప్తి చెందగా.. చైనాలోనే రికార్డు స్థాయిలో 9,692 కేసులు పాజిటీవ్‌గా నిర్ధారించబడ్డాయి. హుబీ ప్రావిన్స్‌లో 5,806 కేసులు నమోదు కాగా, ఇందులో 204 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. భారత్ సహా 20 దేశాలకు కరోనా వైరస్ పాకినట్లు సమాచారం.
భారత్‌లో గురువారం తొలి కరోనా పాజిటివ్ కేసు గుర్తించారు. చైనాలోని వుహాన్ నగరం నుండి కేరళకు వచ్చిన ఓ విద్యార్థినికి పరీక్షలు చేయగా కరోనా సంక్రమించినట్లు తేలింది. దీంతో భారత్‌లోనూ కరోనా వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. కరోనా వ్యాప్తికాకుండా త్వరిగతిన చర్యలు తీసుకుంటాన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా సోకిన విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..