Corona New Variant: ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారి మరో రూపం దాల్చింది. కనుమరుగైందనుకునేలోగా కొత్తరూపంతో ఎటాక్ చేస్తోంది. యూఎస్, బ్రిటన్ దేశాల్ని వణికిస్తోంది.
కరోనా మహమ్మారి 2019 డిసెంబర్ నుంచి ప్రపంచాన్నివణికిస్తూ..లక్షలాదిమంది ప్రాణాలు తీసుకుంది. కుటుంబాల్ని నాశనం చేసింది. కరోనా వైరస్, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ ఇలా రూపాలు మార్చుకుంటూ ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్..కనుమరుగైందనుకునేలోగా మరోసారి దాడి చేస్తోంది. మరో రూపంతో ముందుకొచ్చింది. కొత్తగా ఒమిక్రాన్ బీఏ 4.6 రకం వైరస్ ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చేసింది.
ఇప్పటివరకూ అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. యూకేలో ఆగస్టు నెలలో పరీక్షించిన కోవిడ్ నమూనాల్లో 3.3 శాతం కొత్త వేరియంట్ కేసులున్నాయి. అదే సమయంలో అమెరికాలో సైతం 9 శాతం కేసులు ఒమిక్రాన్ బీఏ 4.6 వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాపించిన తొలి రెండేళ్లలో 1.70 కోట్లమంది దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఈ దీర్ఘ కాలిక లక్షణాలు పురుషుల కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉందని తేలింది.
Also read: Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, కూలిన వంతెనలు, భవనాలు, సునామీ హెచ్చరిక జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok