Ivermectin Medicine: ఐవర్‌మెక్టీన్ డ్రగ్ వినియోగంపై భిన్నాభిప్రాయాలు

Ivermectin Medicine: యాంటీ పారా సైటిక్ డ్రగ్ ఐవర్‌మెక్టిన్‌పై మరో స్పష్టత వచ్చింది. కరోనా విషయంలో ఈ మందు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఇంతకీ ఐవర్ మెక్టిన్ వినియోగించవచ్చా లేదా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2021, 02:46 PM IST
Ivermectin Medicine: ఐవర్‌మెక్టీన్ డ్రగ్ వినియోగంపై భిన్నాభిప్రాయాలు

Ivermectin Medicine: యాంటీ పారా సైటిక్ డ్రగ్ ఐవర్‌మెక్టిన్‌పై మరో స్పష్టత వచ్చింది. కరోనా విషయంలో ఈ మందు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఇంతకీ ఐవర్ మెక్టిన్ వినియోగించవచ్చా లేదా..

కరోనా చికిత్సకు(Corona Treatment) సంబంధించి వాడుకలో ఉన్న మందుల గురించి ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా చికిత్సలో ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనేది వెల్లడవుతోంది. అదే క్రమంలో యాంటీ పారా సైటిక్ డ్రగ్ ఐవర్‌మెక్టిన్‌ (Ivermectine)పై పరిశోధనలు జరిగాయి. కరోనా చికిత్సలో ఈ మందు మెరుగైన ఫలితాల్ని సాధిస్తోందని తేలింది. ఐవర్‌మెక్టీన్ తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా తగ్గుతోందని తేలింది. కరోనా రోగుల్లో మరణముప్పు కూడా ఈ మెడిసిన్‌తో తగ్గుతోందని పరిశోధనలో తేలింది. ఈ వివరాలు అమెరికా జర్నల్ ఆఫ్ థెరపెటిక్స్ వెల్లడించింది. అటు గోవా (Goa) ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఐవర్ మెక్టిన్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) సూచనలు మరోలా ఉన్నాయి. ఏదైనా కొత్తవ్యాధికి మందు వినియోగించేటప్పుడు కచ్చితమైన భద్రత, సమర్ధత కలిగి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్(Dr Soumya Swaminathan) తెలిపారు. కోవిడ్‌పై జరిపే క్లినికల్ ట్రయల్స్‌(Clinical trials)లోనే వాడాలని సూచించారు. అయితే 2021 జనవరిలో ఐవర్‌మెక్టిన్ మెడిసిన్‌పై మొత్తం 27 కంట్రోల్ ట్రయల్స్ జరిపామని కంపెనీ చెబుతోంది. మొత్తం 2 వేల 5 వందల మంది రోగులపై ఈ డ్రగ్‌ను పరీక్షించామంటోంది. ఈ డ్రగ్ తీసుకున్నవారిలో మరణాలు రేటు తగ్గి..రికవరీ సమయం కూడా మిగిలివాటితో పోలిస్తే తగ్గిందని అంటోంది. 

Also read: Covid-19 Variant: ప్రాణాంతక కరోనా వేరియంట్ 44 దేశాలకు వ్యాపించింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News