చైనా ప్రభుత్వం గత మూడేళ్ళలో దాదాపు 13000 వెబ్సైట్లను తొలిగించింది. అధ్యక్షుడిగా జిన్ పింగ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. ముఖ్యంగా అంతర్జాలంలో లభించే అశ్లీలమైన కంటెంట్ చూడకుండా చైనా యువతను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కేవలం వెబ్సైట్లకు మాత్రమే కాకుండా బ్లాగులు, సోషల్ మీడియా పేజీలకు కూడా ఈ నియమం వర్తిస్తుందని ఓ ప్రముఖ చైనా పత్రిక ఇటీవలే వెల్లడించింది.
ఇటీవలి కాలంలో చైనా ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ దాదాపు 2000 మంది దేశీయ వెబ్సైట్ నిర్వహకులకు సైతం సమన్లు జారీ చేసింది. అనేక విదేశీ వెబ్సైట్లపై కూడా నిషేధం విధించిన చైనా ప్రభుత్వం, తమ దేశంలో ఈ విషయంలో నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేయనున్నట్లు ప్రకటించింది.