Omicron: గతంలో కరోనా నుంచి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి..

Omicron Variant:  డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నప్పటికీ.. మున్ముందు దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే గతంలో కరోనా బారినపడి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా.. ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిలో కలుగుతోంది.

Last Updated : Jan 8, 2022, 04:51 PM IST
  • గతంలో కరోనా బారినపడి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా
  • ఇందుకు అవుననే అంటున్నారు పరిశోధకులు
  • కరోనా నుంచి కోలుకున్నవారికి ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్ రావొచ్చు
  • డెల్టా పోలిస్తే ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువే
Omicron: గతంలో కరోనా నుంచి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి..

Omicron Variant: ఆఫ్రికా, యూరోప్ దేశాల్లో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ (Covid Third Wave) మొదలైంది. భారత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో థర్డ్ వేవ్ మొదలైందనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో డెల్టా వేరియంట్ కేసుల కారణంగా సెకండ్ వేవ్ సంభవించగా... ఈసారి ఒమిక్రాన్ వ్యాప్తితో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నప్పటికీ.. మున్ముందు దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే గతంలో కరోనా బారినపడి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా.. ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిలో కలుగుతోంది.

ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్ ముప్పు ఉంటుందా..? 

దక్షిణాఫ్రికాలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం... కోవిడ్ 19 నుంచి కోలుకున్నవారు ఒమిక్రాన్ కారణంగా రీఇన్ఫెక్షన్‌ బారిన డేందుకు అవకాశం ఉంది. గత కోవిడ్ వేరియంట్లు డెల్టా, బీటాలతో పోలిస్తే ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. దక్షిణాఫ్రికాలో మార్చి 2020 నుంచి నవంబర్ 2021 వరకు నమోదైన కోవిడ్ టెస్టులు, కేసుల వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు.

గతంలో డెల్టా, బీటా వేరియంట్లు వ్యాప్తి చెందినప్పుడు వైరస్ సంక్రమణ స్థిరంగా ఉందని... కానీ ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వ్యాప్తి అమాంతం పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అయితే రీఇన్ఫెక్షన్ ముప్పు అన్ని దేశాల్లో ఒకేలా ఉండకపోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఆయా దేశాల్లో జరిగిన వ్యాక్సినేషన్ బట్టి ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్ వ్యాప్తి ఉండవచ్చునని చెబుతున్నారు. 

డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది..:

గతంలో కోవిడ్ 19 బారినపడి కోలుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ (WHO) వెల్లడించింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కారణంగా రీఇన్ఫెక్షన్ ముప్పు 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఎక్కువగా 20, 30 ఏళ్ల వయసు వారిలోనే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు (Omicron Spread) పేర్కొంది. అయితే ఇది డెల్టా కన్నా తీవ్రమైనది అని చెప్పేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేకపోవడం సంతోషించాల్సిన విషయమని తెలిపింది. విస్తృతంగా వ్యాక్సినేషన్ జరపడం.. కట్టడి చర్యలు చేపట్టడం... హెల్త్ కేర్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం... మున్ముందును ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఈ మూడు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది.

Also Read: మా అక్కతో రాఘవకు అక్రమ సంబంధం.. సంచలనం రేపుతున్న నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News