Rat Magawa Dies: గతేడాదే రిటైర్మంట్‌ తీసుకున్న 'హీరో' మూషికం మృతి.. ఘనంగా అంత్యక్రియలు!!

మందు పాతరలను గుర్తించడం, వాటిని వెలికి తీయడంలో ఎంతో కీలకంగా పనిచేసిన హీరో మూషికం 'మగావా' మృతి చెందింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 12:13 PM IST
  • వందకు పైగా మందుపాతరలను గుర్తించిన మూషికం
  • గతేడాదే రిటైర్మంట్‌ తీసుకున్న హీరో మూషికం మృతి
  • ఎలుకకు ఘనంగా అంత్యక్రియలు
Rat Magawa Dies: గతేడాదే రిటైర్మంట్‌ తీసుకున్న 'హీరో' మూషికం మృతి.. ఘనంగా అంత్యక్రియలు!!

Cambodia's landmine-sniffing Hero Rat Magawa dead: సాధారణంగా ఎలుక (Rat)లు చాలా నష్టాలను కలిగిస్తాయి. ఇంట్లో, చేనుల్లో అవి చేసే పనులు మాములుగా ఉండవు. ఇళ్లలో ఖరీదైన సామాగ్రిని, చేనులో పంటను నాశనం చేస్తుంటాయి. అందుకే ఎలుకలు ఉన్నాయంటే.. బోన్‌ పెట్టో లేదా ప్యాడ్‌ పెట్టో వాటిని చంపేస్తుంటాం. కానీ ప్రత్యేక శిక్షణ పొందిన ఓ ఎలుక మాత్రం ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడింది. ఫలితంగా బంగారు పతకాన్ని (Gold Medal Rat) కూడా అందుకుంది. అంతేకాదు ఆ ఎలుక మనుషుల వలె గతేడాదే రిటైర్మంట్‌ (Rat Retirement) కూడా తీసుకుంది. అయితే ఆ ఎలుక తాజాగా కన్నుమూసింది.

ఆఫ్రికన్‌ సంతతికి చెందిన 'మగావా' అనే ఎలుక మందు పాతరలను (Landmine) గుర్తించడం, వాటిని వెలికి తీయడంలో ఎంతో కీలకంగా పనిచేసింది. పేలుడుకు అవకాశం లేకుండా ముందుగానే ఎన్నో మందు పాతరలను గుర్తించింది. బెల్జియం కేంద్రంగా పనిచేసే 'అపొపో' అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మందు పాతరల వంటివి వాసన ద్వారా కనుగొనేలా ఎలుకలు, కుక్కలకు శిక్షణ ఇచ్చే సంస్థ 'అపొపో' (APOPO). 2013లో టాంజానియాలో పుట్టిన మగావాను శిక్షణ అనంతరం 2016లో కాంబోడియాకు పంపారు. అప్పటి నుంచి వందకు పైగా మందుపాతరలను గుర్తించింది. 

Also Read: Malaika Arora - Arjun Kapoor: మరో స్టార్ కపుల్ బ్రేకప్.. షాకింగ్ కౌంటర్ ఇచ్చిన హీరో!!

కాంబోడియా (Cambodia) దేశంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధం 1998లో ముగిసింది. యుద్ధ సమయంలో భూమి లోపల పాతి పెట్టిన మందు పాతరలు పెద్ద సవాల్‌గా మారాయి. అవి పేలి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఐదేళ్ల పాటు సేవలు అందించిన మగావా.. ఎన్నో మందు పాతరలను, బాంబులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంలో అద్భుతమైన సేవలను అందించింది. అయితే ఎనిమిదేళ్ల ఆ ఎలుకకు మనుషుల వలె రిటైర్మెంట్‌ ఇచ్చారు. 

మూషిక రాజు 'మగావా' (Magawa) అందించిన సేవలను బ్రిటన్‌కు చెందిన 'పీపుల్స్‌ డిస్పెన్సరీ ఫర్‌ సిక్‌ అనిమల్స్‌' అనే వెటర్నరీ ఛారిటీ సంస్థ గుర్తించింది. 2020లో మగావాకు బంగారు పతకాన్ని కూడా అందజేసింది. చూడడానికి చిన్న జీవే అయినా.. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ మూషిక రాజు చివరకు మృతి చెందింది (Hero Rat Magawa Dead). ఎంతో పేరు ప్రతిష్టతలు అందుకున్న మగావాకు ఘనమైన అంత్యక్రియలు కూడా జరిగాయి. విషయం తెలుకున్న  కాంబోడియా ప్రజలు సంతాపం  తెలిపారు. 

Also Read: రంగంలోకి మెగాస్టార్... నేడు సీఎం జగన్‌తో భేటీ.. సినిమా టికెట్ ధరల వివాదం కొలిక్కి వచ్చేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News