Brexit: బ్రెగ్జిట్ అంటే ఏమిటి...బ్రిటన్ లో ఏం మారుతున్నాయి?

Brexit: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే బ్రెగ్జిట్. అయితే ఆ బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ టైమ్ ఇప్పుడు ముగిసింది. బ్రెగ్జిట్ కారణంగా...బ్రిటన్ లో చోటుచేసుకోనున్న మార్పులేంటి..ఆ వివరాలివీ..

Last Updated : Jan 2, 2021, 07:28 PM IST
  • ముగిసిన బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ పీరియడ్..మారుతున్న నిబంధనలు
  • ఈయూలో బ్రిటీషు వాహన రాకపోకలకు గ్రీన్ కార్డు వెంట ఉండాల్సిందే
  • ఈయూ దేశాల్లో బ్రిటీషర్లకు ఇకపై వీసా నిబంధనలు తప్పనిసరి
Brexit: బ్రెగ్జిట్ అంటే ఏమిటి...బ్రిటన్ లో ఏం మారుతున్నాయి?

Brexit: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే బ్రెగ్జిట్. అయితే ఆ బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ టైమ్ ఇప్పుడు ముగిసింది. బ్రెగ్జిట్ కారణంగా...బ్రిటన్ లో చోటుచేసుకోనున్న మార్పులేంటి..ఆ వివరాలివీ..

యూరోపియన్ యూనియన్ అంటే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియనే బ్రెగ్జిట్ ( Brexit )  అంటారు. అయితే బ్రెగ్జిట్ వల్ల చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకేసారి మార్పులు అమలైతే కష్టం కాబట్టి...ట్రాన్సిషన్ పీరియడ్ ఇచ్చారు. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ముగిసింది. దీని ప్రకారం బ్రిటన్ పౌరులు చవిచూసే మార్పులివే..

యూరోపియన్ యూనియన్ ( European Union ) పరిధిలో యూకే ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఇమ్మిగ్రేషన్ ఇకపై తప్పనిసరిగా మారింది. ఇతర దేశాలకు వెళ్లాలంటే వీసా ( Visa ), రెడ్ టేప్ నిబంధనలు పాటించాలి. విదేశాల్లో కుటుంబాలున్నవారికి ఇది ప్రధాన అవరోధంగా మారుతుంది. 

ఈయూ ( EU ) లోని దేశాలకు వెళ్లాలంటే గతమంత సులభం కాదిప్పుడు. సెలవు రోజుల్లో మాత్రం ఫ్రీ వీసా ( Free Visa ) ప్రక్రియ ద్వారా వెళ్లవచ్చు. ఈయూ ఆరోగ్య భీమా కార్డు బ్రిటీషర్లకు ఇకపై వర్తించవు. గతంలో ఉన్నట్టు ఈయూ దేశాల్లో చదువుకోవడం, బోధించడం, పని చేయడం వంటివి సాధ్యం కావు. 

బ్రిటీష్ వాహన లైసెన్స్‌తో ఈయూలో తిరగవచ్చు కానీ..గ్రీన్‌కార్డు ( Green card ) వెంట ఉండాలి. జీబీ స్టిక్కర్ తప్పనిసరి. ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్థుల ప్రాధాన్యత తగ్గనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, హక్కులు తగ్గిపోతాయి. ఈయూ భాగస్వామ్యంతో వ్యాపారం కోసం ఇకపై పేపర్‌వర్క్, రుసుము ఎక్కువగా ఉంటుంది. 

ఓ వైపు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగినా..బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  ( Britain pm Boris johnson ) తండ్రి స్టాన్లీ మాత్రం ఫ్రెంచ్ పౌరసత్వం కోసం దాఖలు చేసుకున్నారు. యూరోపియన్‌గానే ఉంటానని స్పష్టం చేశారు.

Also read: Pfizer-BioNTech వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతి

Trending News