Flight Missing: నేపాల్‌లో విమానం అదృశ్యమైంది. 22 మంది ప్రయాణీకులతో ఉన్న ఆ విమానం గల్లంతవడం ఆందోళన కల్గిస్తోంది. ఈ విమానంలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు
నేపాల్ దేశంలో విమానం అదృశ్యం కలకలం రేపుతోంది. 22 మంది ప్రయాణీకుల ఆచూకీపై ప్రశ్నలు వస్తున్నాయి. తార ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నేపాల్‌లో అదృశ్యమైపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోవడంతో..ఏమైందనేది తెలియడం లేదు. ఈ విమానంలో 22 మంది ప్రయాణీకులుండగా..అందులో నలుగురు భారతీయులున్నారు.
నేపాల్ ఏటీసీతో ఇవాళ ఉదయం 9.55 నిమిషాల వరకూ సంబంధాలు కలిగే ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయాయి. సంబంధాలు కట్ అయ్యేముందు విమానం మౌంట్ ధౌలగిరి వైపు వెళ్లిందని ఏటీసీ అధికారులు తెలిపారు. మరి కొందరైతే ఉదయం 10.35 నిమిషాలకు ఏటీసీని కాంటాక్ట్ చేసిందంటున్నారు. చివరిసారి విమానం కాంటాక్ట్ చేసిన ప్రాంతానికి ప్రత్యేక హెలీకాప్టర్లను పంపిస్తున్నారు. ఈ విమానంలో నలుగురు భారతీయులు సహా 22 మంది ప్రయాణీకులున్నారు. ఇందులో 13 మంది నేపాలీలు కాగా, నలుగురు భారతీయులు, పైలట్, కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే, కో పైలట్ ఇటాసా పోఖారెల్, ఎయిర్ హోస్టెస్ ఖాస్మీ థాపా ఉన్నారు. ప్రస్తుతం విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో ఆకాశంలో విమానం కన్పించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతం దాటిన తరువాత విమానం క్రాష్ అయుండవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2018లో కూడా తార ఎయిర్ లైన్స్ విమానం అదృశ్యమై..ఆ తరువాత కుప్పకూలిన దశలో కన్పించింది.
Also read: Stampede: తిండి కోసం ఎగబడిన జనం.. తొక్కిసలాటలో 31 మంది దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook