Blast in Dhaka Bangladesh: మంగళవారం సాయంత్రం బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని గులిస్థాన్ ప్రాంతంలోని భవనంలో జరిగిన పేలుడులో సుమారు పదకొండు మంది మరణించారు, దాదాపుగా 100 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక దళానికి నాయకత్వం వహిస్తున్న అధికారి రషీద్ బిన్ ఖలీద్ మాట్లాడుతూ, అగ్నిమాపక సేవ యొక్క పదకొండు యూనిట్లు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి పని చేస్తున్నాయని తెలిపారు.
ఇక ఈ పేలుడు ధాటికి గులిస్తాన్ బీఆర్‌టీసీ బస్ కౌంటర్‌కు దక్షిణం వైపున ఉన్న ఐదంతస్తుల భవనం, గ్రౌండ్ ఫ్లోర్‌లోని శానిటరీ షాప్, బ్యాంక్ కార్యాలయం ధ్వంసమైనా, భవనాలు మాత్రం ఏవీ కూలి పోలేదని అంటున్నారు. ఇక అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4:45 గంటల ప్రాంతంలో బీఆర్‌టీసీ బస్ కౌంటర్ సమీపంలో పేలుడు సంభవించిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మృత దేహాలు, 100 మందికి పైగా క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు డిఎంసిహెచ్ పోలీస్ అవుట్‌పోస్టు ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా తెలిపారు.
అయితే అసలు పేలుడుకు గల కారణాలు ఏమిటి అనేది ఇంకా గుర్తించలేకపోయారని అంటున్నారు. సిద్దిఖీ బజార్‌లోని పలు కార్యాలయాలు, దుకాణాలు ఉన్న వాణిజ్య భవనంలో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున క్షతగాత్రులు నమోదయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం 11 మంది మరణించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 100 మందికి పైగా కాలిన గాయాలతో రక్షింపబడ్డారని, చాలా మంది ఆసుపత్రికి తరలిరావడంతో ఆసుపత్రిపై భారీ ఒత్తిడి ఏర్పడిందని అంటున్నారు. పలువురు తీవ్రంగా కాలిన గాయాలతో బయటపడ్డారని, వారికి రానున్న మూడు-నాలుగు కీలకం అని అంటున్నారు.
ఈ పేలుడు స్థానిక కాలమానం ప్రకారం దాదాపు సాయంత్రం 4:50 గంటలకు జరిగిందని అంటున్నారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ యూనిట్‌లో అందరికీ చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు. ఇక భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అనేక శానిటరీ ఉత్పత్తుల దుకాణాలు ఉన్నాయని, వాటి పక్కనే BRAC బ్యాంకు శాఖ ఉందని అంటున్నారు. ఇక ఈ పేలుడు ధాటికి రోడ్డుకు ఎదురుగా ఆగి ఉన్న బస్సు కూడా ధ్వంసమైందని చెబుతున్నారు.
Also Read: Ram Gopal Varma Uncle: రామ్ గోపాల్ వర్మ ఇంట తీవ్ర విషాదం..పరామర్శించిన అల్లు అర్జున్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి