విజృంభిస్తున్న కరోనా కేసులు...ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్...!

కొవిడ్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరోసారి లాక్​డౌన్ విధిస్తున్నట్లు ఆస్ట్రియా ప్రకటించింది. సోమవారం ప్రారంభమయ్యే ఈ లాక్​డౌన్​ 10 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 06:29 PM IST
విజృంభిస్తున్న కరోనా కేసులు...ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్...!

Austria Lockdown: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సిద్దమవుతున్నాయి పలుదేశాలు. యూరప్ లో కొత్త వేవ్ కారణంగా కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్(Lockdown) విధించాలని ఆస్ట్రియా ప్రభుత్వం(Austria)​ నిర్ణయం తీసుకుంది.

 ఇది ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్​బర్గ్​(Chancellor Alexander Schallenberg ) శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. కొవిడ్​ కేసులు తగ్గుముఖం పట్టకపోతే మరో 10 రోజులపాటు లాక్​డౌన్​ను పొడిగిస్తామని స్పష్టం చేశారు ఛాన్సలర్. పాఠశాలలు, రెస్టారెంట్లను మూసివేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలను (Austria Lockdown) రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజా ప్రకటనతో మరోసారి పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధించిన తొలి ఐరోపా దేశంగా ఆస్ట్రియా నిలిచింది.

Also Read: Snow leopards Corona: కరోనాతో మంచు చిరుతలు మృతి...ఎక్కడంటే...

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి దేశంలో వ్యాక్సినేషన్(Vaccination)​ తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశంలో టీకా వేయించుకోని వారిపై మాత్రమే లాక్​డౌన్​ అమలులో ఉంది. 12 ఏళ్ల కంటే ఎక్కువ ఉండి టీకా తీసుకోని వారు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గత ఏడు రోజులుగా ఆస్ట్రియాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సుమారు 90 లక్షల మంది జనాభా ఉన్న ఆస్ట్రియాలో 65.7 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News