Kamala Harris: ఉగ్రవాద సమస్యలపై పాక్‌కు క్లాస్ పీకిన కమలా హ్యారిస్

Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య ఉగ్రవాద సమస్యలు ప్రదానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ కమలా హ్యారిస్ పాక్‌కు హితవు పలకడం విశేషం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2021, 02:25 PM IST
  • ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్‌కు హితవు పలికిన కమలా హ్యారిస్
  • ఉగ్రవాద సమస్యలపై ప్రదాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మధ్య చర్చలు
  • ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత వాతావరణంపై ఇండియా జపాన్ దేశాల మద్య చర్చలు
Kamala Harris: ఉగ్రవాద సమస్యలపై పాక్‌కు క్లాస్ పీకిన కమలా హ్యారిస్

Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య ఉగ్రవాద సమస్యలు ప్రదానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ కమలా హ్యారిస్ పాక్‌కు హితవు పలకడం విశేషం.

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో మోదీ సమావేశమయ్యారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య ప్రధానంగా ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపై చర్చ జరిగింది. పాకిస్తాన్‌లో ఎన్నో ఉగ్రవాద సంస్థలున్నాయని..వాటిపై అక్కడి ప్రభుత్వం గట్టిగా చర్చలు తీసుకోవాలని కమలా హ్యారిస్ పాకిస్తాన్‌కు హితవు పలికారు. అలా జరిగినప్పుడే అమెరికా-భారత్‌లపై ఉగ్రవాదం నీడ పడకుండా ఉంటుందన్నారు. 

గత కొన్ని దశాబ్దాలుగా ఇండియా ఉగ్రవాదానికి  ఏ విధంగా బాధిత దేశంగా మారిందో ప్రధాని మోదీ ఇచ్చిన వివరణకు కమలా హ్యారిస్(Kamala Harris)సమర్ధించారు. ప్రధాని మోదీతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా కమలా హ్యారిస్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచే చర్యలు తీసుకోవాలని కమలా హ్యారిస్ సూచించారు. మరోవైపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పేలా కృషి చేయాలని ఇండియా జపాన్ దేశాలు స్పష్టం చేశాయి. క్వాడ్ సదస్సు(Quad Meeting)కంటే ముందే ప్రధాని నరేంద్ర మోదీ..జపాన్ ప్రధానితో చర్చలు జరిపారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. 

Also read: Google Incognito: గూగుల్ ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ ఎంతవరకూ క్షేమకరం, కొత్త ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News