Check to China: ప్రపంచ దేశాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అగ్రదేశాలు ప్రయత్నిస్తున్నాయి. కరోనా సంక్షోభం తరువాత చైనాను నిలువరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొత్త జో బిడెన్ ప్రతిపాదనకు మిశ్రమ స్పందన ఎదురవుతోంది.
ప్రపంచంలోని అగ్రదేశాలకు ఇప్పుడు చైనా(China)అతి పెద్ద శత్రువు. మొన్నటివరకూ వాణిజ్యపరంగా చైనాను ఎదుర్కొనేందుకు వ్యూహాలు పన్నిన అగ్రరాజ్యాలకు కరోనా వైరస్ ఓ ఆయుధంగా మారింది. కరోనా వైరస్ సంక్రమణకు చైనానే కారణమని ఇప్పటికే పలు దేశాలు బలంగా భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొత్త ప్రతిపాదన సిద్ధం చేశారు. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని జీ 7 దేశాలకు జో బిడెన్ చేసిన ప్రతిపాదనకు సానుకూలత, వ్యతిరేకత రెండూ వ్యక్తమవుతున్నాయి. జో బిడెన్ (Joe Biden) ప్రతిపాదనకు కెనడా, యూకే, ఫ్రాన్స్ దేశాల్నించి మద్దతు లభించగా..జర్మనీ, ఇటలీ, ఈయూలు బిడెన్ ప్రతిపాదనపై సముఖత వ్యక్తం చేయలేదు. అటు మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై కూడా చైనాను ఇరుకునపెట్టే అంశంపై జీ 7 దేశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ రెండు అంశాలపై జీ 7 దేశాలు సంయుక్త ప్రకటన చేయాలన్నది జో బిడెన్ అభిప్రాయం.
చైనా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌కు పోటీగా బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ ద వరల్డ్ పేరిట అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌళిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని జీ 7 దేశాలు (G 7 Countries) సూతప్రాయంగా అంగీకారం తెలిపాయి. అయితే చైనా పట్ల అమెరికా అవలంభిస్తున్న కఠిన వైఖరిపై మిత్రదేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ సదస్సు ద్వారా చైనాకు గట్టి సందేశం పంపాలనుకుంటున్న అమెరికా ఆలోచన విజయవంతమవుతుందా లేదా వేచి చూడాల్సి ఉంది.
Also read: FDA Rejects Covaxin: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి నిరాశే, అనుమతి ఇవ్వని FDA
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook