Barak Obama: కరోనా మహమ్మారి మళ్లీ ప్రారంభం కానుందా..క్రమంగా సెలెబ్రిటీల్ని తాకుతోంది. అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని ట్వీట్ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని..ఆయన స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నానని..ప్రస్తుతానికి బాగానే ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. తాను, మిచెల్ వ్యాక్సిన్ తీసుకున్నామని..పరీక్షల్లో మిచెల్‌కి నెగెటివ్‌గా తేలిందని ట్వీట్ చేశారు. కేసులు తగ్గినప్పటికీ ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలని ట్విట్టర్‌లో తెలిపారు ఒబామా.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. చాలా దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఐతే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని దేశాల్లో కరోనా కనుమరుగు అవుతున్న వేళ చైనాలో గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దీంతో జిన్‌పింగ్ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. కీలక నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.
అమెరికాలో గత జనవరిలో రోజువారిగా నమోదైన కేసుల సరాసరి 8 లక్షలుగా ఉంది. ప్రస్తుతానికి 35 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇటు భారత్‌లోనూ కరోనా అదుపులోనే ఉంది. రోజువారి కేసుల సంఖ్య క్రమేపి తగ్గుతోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరమైంది.
Also read: Earthquake: మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో తెల్లవారుజామున భారీ భూకంపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Barak Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు కరోనా