Al Zawahiri Killed: అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీ హతం.. కాబూల్‌లో మట్టుబెట్టిన అమెరికా.. సర్జన్ నుంచి ఉగ్రవాదిగా మారిన జవహరీ..

Al Qaeda Chief Al Zawahiri Killed: ఈజిప్ట్‌లో పుట్టిన అల్ జవహరీ ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా చీఫ్‌గా ఎదిగాడు. వైద్య విద్యను అభ్యసించిన అల్ జవహరీ ఈజిప్ట్ సైన్యంలో మూడేళ్ల పాటు సర్జన్‌గా సేవలందించాడు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 2, 2022, 07:26 AM IST
  • అల్ ఖైదా చీఫ్ హతం
  • ఆఫ్గన్‌లోని కాబూల్‌లో మట్టుబెట్టిన అమెరికా
  • డ్రోన్ దాడుల్లో అల్ జవహరీ హతమైనట్లు ప్రకటన
Al Zawahiri Killed: అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీ హతం.. కాబూల్‌లో మట్టుబెట్టిన అమెరికా.. సర్జన్ నుంచి ఉగ్రవాదిగా మారిన జవహరీ..

Al Qaeda Chief Al Zawahiri Killed: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టింది. ఆఫ్గనిస్తాన్‌లోని కాబూల్‌లో డ్రోన్ దాడితో అతన్ని అంతమొందించింది. శనివారం (జూలై 29) లేదా ఆదివారం (జూలై 30) అమెరికా ఈ ఆపరేషన్‌ని చేపట్టినట్లు తెలుస్తోంది. అల్ జవహరీ హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు. అమెరికాపై జరిపిన 9/11 దాడుల్లో బిన్ లాడెన్ తర్వాత ప్రధాన సూత్రధారిగా ఉన్న అల్ జవహరీని మట్టుబెట్టడం ద్వారా బాధితులకు న్యాయాన్ని అందించినట్లయిందన్నారు బైడెన్. 

అల్ జవహరీని మట్టుబెట్టేందుకు చేపట్టిన డ్రోన్ ఆపరేషన్‌లో జవహరీ కుటుంబ సభ్యులు సహా సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా వెల్లడించింది. గతేడాది ఆగస్టులో ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకున్న తర్వాత అగ్ర రాజ్యం అక్కడ జరిపిన తొలి దాడి ఇదే కావడం గమనార్హం. తాజా దాడిని ఆఫ్గనిస్తాన్‌కు చెందిన తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఖండించారు. ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని మండిపడ్డారు.

కాబూల్‌లోని షేర్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్ జవహరీ హతమైనట్లు తెలుస్తోంది. తెల్లవారుజాము సమయంలో ఆ ప్రాంతంలో భారీ పేలుడు శబ్ధం వినిపించినట్లు ఆఫ్గన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్ నఫీ టకోర్ వెల్లడించారు.

9/11 దాడులే కాదు అమెరికా టార్గెట్‌గా జరిగిన పలు బాంబు దాడుల్లో అల్ జవహరీ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఆగస్టు 7,1998న కెన్యా, టాంజానియాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులు జరిపి 224 మంది అమెరికన్లను పొట్టనబెట్టుకోవడంలో కీలక వ్యవహరించాడు. తాజా దాడి జరిగేంతవరకూ అతను పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో లేదా ఆఫ్గనిస్తాన్‌లో సంచరిస్తున్నట్లు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

సర్జన్ నుంచి ఉగ్రవాదిగా :

ఈజిప్ట్‌లో పుట్టిన అల్ జవహరీ ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా చీఫ్‌గా ఎదిగాడు. వైద్య విద్యను అభ్యసించిన అల్ జవహరీ ఈజిప్ట్ సైన్యంలో మూడేళ్ల పాటు సర్జన్‌గా సేవలందించాడు. 1981లో అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడ అన్వర్ సదత్ హత్య కేసులో అరెస్టయిన వందలాది మందిలో అల్ జవహరీ ఒకరు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌లో చిత్రహిసంలకు గురయ్యాడు.1998లో అల్ జవహరీ స్థాపించిన ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ (ఈఐజే) అల్‌ఖైదాలో విలీనమైంది. 9/11 దాడుల తర్వాత అల్ జవహరీపై అమెరికా 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఎట్టకేలకు జవహరీని అమెరికా కాబూల్‌లో మట్టుబెట్టగలిగింది.

Also Read: Horoscope Today August 2nd: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అనుకోని వివాదంలో చిక్కుకునే ఛాన్స్..

Also Read: Bandi Sanjay: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వేళాయే..షెడ్యూల్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News