పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ పై ఓ సామాన్య పౌరుడు నల్లటి సిరాబుడ్డిని విసిరాడు. మంత్రి సియాల్ కోట్లో జరిగిన పార్టీ మీటింగ్లో ప్రసంగిస్తున్నప్పుడు ఆ ఘటన చోటు చేసుకుంది. మంత్రిపై నల్లటి సిర పడగానే.. పార్టీ వర్కర్లందరూ ఆ పౌరుడిపై దాడి చేశారు. ఆ తర్వాత మంత్రి వారిస్తున్నా... దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఆ పౌరుడిని విచారించిన పోలీసులు అతని పేరు ఫైజ్ రసూల్ అని తెలుసుకున్నారు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. ఇటీవలే ప్రభుత్వం ముస్లిం ప్రవక్త మహమ్మద్ సూత్రాలను రాజ్యాంగంలో వక్రీకరించి రాసినందుకు నిరసనగా తాను ఈ పనిచేశాడని తెలపడం గమనార్హం. తన భావాలు దెబ్బతిన్నందుకు ఆయన ఈ పనిచేశానని తెలిపాడు.
అయితే తనపై సిరను జల్లిన యువకుడిపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఆయన ఉద్వేగంలో ఆ పని చేసుంటాడని.. తనను విడిచిపెట్టమని పోలీసులకు చెబుతానని మంత్రి తెలిపారు. పాకిస్తాన్లో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన బూట్లను విసిరాడు.
#WATCH: A man throws ink on Pakistan Foreign Minister Khawaja Muhammad Asif while he was attending an event in Sialkot, Pakistan last night. pic.twitter.com/1Rcm6JTP2U
— ANI (@ANI) March 11, 2018