Afghanistan Crisis: తాలిబన్లు రాజ్యమేలుతున్న ఆఫ్గనిస్తాన్‌లో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. చివరకు పొట్ట కూటి కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి కూడా అక్కడి ప్రజలు వెనుకాడట్లేదు. దీన్నిబట్టి తాలిబన్ల పాలనలో ఆఫ్గన్ ప్రజలు ఎంత దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాలేవీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సుముఖంగా లేకపోవడం... అంతర్జాతీయ సంస్థల నుంచి అందాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఆఫ్గన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది.
గతేడాది ఆగస్టులో తాలిబన్లు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వాన్ని స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆఫ్గన్ ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారుతూ వస్తోంది. ఉద్యోగ, ఉపాధి లేక, తినడానికి తిండి లేక ప్రజలు అలమటిస్తున్నారు. దేశంలో పేదరికం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో ఉన్న వస్తువులు అమ్ముకుని.. ఆ డబ్బులతో పొట్ట నింపుకుంటున్నారు. చాలామంది పేదలు కిడ్నీలు అమ్ముకుని.. ఆ డబ్బుతో కుటుంబాలను పోషిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఆఫ్గన్‌కి చెందిన యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా.నజీర్ అహ్మద్ మాట్లాడుతూ.. గతేడాది తాను 85 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. ఆఫ్గన్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు దాదాపు రూ.6లక్షలు వరకు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. ఇందులో కిడ్నీ ఖరీదు రూ.1.60 లక్షల వరకు ఉంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ పోషణ కోసం చాలామంది పేదలు కిడ్నీలను అమ్ముకుంటున్నారని... కానీ దాని కారణంగా దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
హెరాత్ ప్రావిన్స్‌లోని కోషన్ జిల్లా ఖదూసాబాద్‌కి చెందిన గులాం హజ్రత్ (40) అనే వ్యక్తి ఇటీవల తన కిడ్నీని రూ.1.71,196కి విక్రయించాడు. కుటుంబ పోషణ కోసమే తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాడు. బయటకు వెళ్లి అడుక్కు తినలేనని... అలా అని కుటుంబం ఆకలితో బాధపడటం చూడలేనని... అందుకే ఆసుపత్రికి వెళ్లి కిడ్నీ అమ్ముకున్నానని హజ్రత్ వాపోయాడు. ఆఫ్గన్‌లో (Afghanistan) ఇప్పుడు హజ్రత్ లాంటి వ్యక్తులు అడుగడుగునా కనిపిస్తున్నారు.
Also read: Video: మెగా ఫ్యామిలీ భోగి సెలబ్రేషన్స్.. చిన్నపిల్లాడిలా వరుణ్‌తో గొడవపడ్డ చిరు...
Also read: Rashmi Gautam: కొంటె చూపులు, నడుము అందాలతో మతి పోగొడుతున్న రష్మీ గౌతమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook