కూలిన విమానం.. 50 మంది మృతి !

కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో సహాయక సిబ్బందికి ప్రయాణికులను కాపాడటం సైతం కష్టంగా మారింది

Last Updated : Mar 13, 2018, 01:45 PM IST
 కూలిన విమానం.. 50 మంది మృతి !

నేపాల్ రాజధాని కాట్మాండులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కాట్మాండు వెళ్తున్న విమానం కాట్మాండు ఎయిర్ పోర్టులో కుప్పకూలిపోయింది. కూలిన వెంటనే విమానానికి నిప్పంటుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే చనిపోగా మిగతా ప్రయాణికులని సహాయక సిబ్బంది విమానం నుంచి రక్షించారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ దుర్ఘటనలో కనీసం 50 మంది చనిపోయి వుంటారని తెలుస్తోంది. కూలిపోయిన విమానంలో 67 మంది ప్రయాణికులు, మరో నలుగురు సిబ్బంది వున్నారు. 

కాట్మాండులో దుర్ఘటన అనంతరం కాట్మాండు విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు నిలిపేశారు. దీంతో కాట్మాండుకి బయల్దేరిన ఒమన్ ఎయిర్, ఖతార్ ఎయిర్‌వేస్, ఫ్లై దుబాయ్ లాంటి విమానయాన సంస్థలకు చెందిన విమానాలు తిరిగి తాము బయల్దేరిన యధా స్థానాలకు బయల్దేరాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.

Trending News