Storm Eunice: 'యూనిస్' తుపాన్ (storm Eunice) వాయువ్య ఐరోపాను అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను ధాటికి ఐరోపా ప్రాంతంలో 9 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ గాలులకు భారీ వృక్షాలు నేలకొరగటంతో.. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, విమాన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ గాలులు ధాటికి కొన్నిచోట్ల ప్రజలు నడుచుకుంటూనే రోడ్లమీద పడిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
These people get blown over by the wind as Storm Eunice batters people to the ground in Croydon, South London.#StormEunice pic.twitter.com/ZUM63K93Ae
— talkRADIO (@talkRADIO) February 18, 2022
'బ్రిటన్‌ను తాకిన బలమైన తుపానుల్లో ఒకటిగా 'యునిస్' చరిత్రలో నిలిచిపోతుంది' అని ఆ దేశ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వరుస తుపానులు ఐరోపా దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్, బెల్జియం, నెదర్లాండ్, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో తుపాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.
ఈ తుపాన్ ధాటికి బ్రిటన్‌లో (UK) ముగ్గురు మరణించారు. దక్షిణ ఇంగ్లండ్ లో కారు చెట్టును ఢీకొట్టడంతో..ఒక వ్యక్తి మరణించారు. లండన్‌లో కారుపై చెట్టు పడడంతో 30 ఏళ్ల మహిళ మరణించారు. నెదర్లాండ్స్‌లో మరో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బెల్జియంలో బలమైన గాలుల తాకిడికి ఓ వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. ఐర్లాండ్‌లో నెలకొరిగిన చెట్లను తొలగిస్తుండగా ప్రభుత్వ సిబ్బంది ఒకరు మృత్యువాత పడ్డారు.
Also Read: Lassa fever : మార్కెట్లోకి మరో ప్రాణాంతక వ్యాధి... యూకేలో 'లస్సా ఫీవర్'తో ముగ్గురు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి