431 పాక్ హిందువులకు "ఆధార్"

  

Last Updated : Oct 29, 2017, 07:03 PM IST
431 పాక్ హిందువులకు "ఆధార్"

భారతదేశానికి వలస వచ్చిన దాదాపు 431 పాకిస్తానీ హిందువులకు లాంగ్ టర్మ్ వీసాలతో పాటు, పాన్ కార్డు, ఆధార్ కార్డులను కూడా అందివ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన మైనారిటీలకు సహాయం చేయడం కోసం ఈ విదేశీ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే గత నెల 431 మంది పాకిస్తాన్ పౌరులకు లాంగ్ టర్మ్ వీసాలు మంజూరు చేసింది. ఆ వీసాలతో వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ,  సూచించిన ప్రదేశాల్లో కనీస నివాసయోగ్యమైన ఇల్లు కొనుక్కొని జీవించవచ్చు. అయితే పూర్తిస్థాయిలో ఇళ్ళ స్థలాలు కొనుక్కోవడానికి మాత్రం ఆమోదం లేదు. వీరికి ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారు ఆర్బీఐ అనుమతి లేకుండా బ్యాంకు అకౌంట్లు కూడా తెరచుకోవచ్చు. ఇటీవలే అహ్మదీయ తెగకు చెందిన 1800 మంది పాకిస్తానీయులకు భారత హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్సు ఇచ్చింది. 

Trending News