CM KCR: నుపుర్ శర్మ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నుపూర్ శర్మ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా దేశం పరువుపోయిందని ఆయన మండిపడ్డారు.
CM KCR-Nupur Sharma: బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా దేశం పరువుపోయిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నుపుర్ శర్మ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు జడ్డీలు మండిపడితే.. నలుగురు రిటైర్ జడ్జిలను తీసుకువచ్చి సర్వోన్నత న్యాయస్థానం లక్ష్మణ రేఖ దాటిందని ట్రోలింగ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు సుప్రీంకోర్టును బేఖాతరు చేస్తున్నారని సీఎం కేసీఅర్ ఎద్దేవా చేశారు.