పేపర్ కప్పులతో అచ్చం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను దించేసిన కళాకారుడు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతల కంట్లో పడేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని పేపర్‌ గ్లాస్‌లతో అరుదైన కళాఖండం రూపొందించాడు. ఆ కళాఖండాన్ని ఓవైపు నుంచి చూస్తే జూనియర్‌ ఎన్టీయార్‌‌లా.., మరోవైపు నుంచి చూస్తే రామ్‌ చరణ్ మాదిరిగా కనిపించేలా అద్భుతంగా తయారు చేశాడు.

  • Zee Media Bureau
  • Mar 24, 2022, 12:28 AM IST

Paper cups art on Jr Ntr, Ram Charan: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్‌ మూవీ మేనియానే కనిపిస్తోంది. మల్టీస్టారర్‌ మూవీ ట్రిపుల్‌ ఆర్‌ మరి కొన్ని గంటల్లోనే థియేటర్లలో అలరించనుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ట్రిపుల్‌ ఆర్‌ మూవీపై అభిమానులే కాకుండా సాధారణ ఆడియెన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఓవైపు ట్రిపుల్‌ ఆర్‌ మూవీ టీమ్‌ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతూ వరుస ఇంటర్వ్యూలతో లైమ్‌లైట్‌లో ఉంటోంది. మరోవైపు అదే సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతల కంట్లో పడేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని పేపర్‌ గ్లాస్‌లతో అరుదైన కళాఖండం రూపొందించాడు. ఆ కళాఖండాన్ని ఓవైపు నుంచి చూస్తే జూనియర్‌ ఎన్టీయార్‌‌లా.., మరోవైపు నుంచి చూస్తే రామ్‌ చరణ్ మాదిరిగా కనిపించేలా అద్భుతంగా తయారు చేశాడు. ఏవైపు నుంచి చూసినా ఎలాంటి లోపం లేకుండా అచ్చం తారక్, చెర్రీలను దించేసిన ఆ ఆర్టిస్టు క్రియోటివిటీ అందరినీ ఆకట్టుకుంటోంది.. ఔరా అని అనుకునేలా చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అతడి క్రియేటివిటీపై మీరూ ఓ లుక్కేయండి.

Video ThumbnailPlay icon

Trending News