Plane Runs On Road: ఫుల్‌ బిజీగా ఉన్న హైవేపై విమానం..!

Plane Runs On Road: హైవేపై ఫుల్‌ బిజీగా కార్లు వెళ్తున్నాయి. అలాంటి సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఒక సింగిల్ ఇంజిన్ విమానం.. నెమ్మదిగా ఆ రోడ్డుపై ల్యాండయింది. అది చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

  • Zee Media Bureau
  • Jul 13, 2022, 06:03 PM IST

Plane Runs On Road: హైవేపై ఫుల్‌ బిజీగా కార్లు వెళ్తున్నాయి. అలాంటి సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఒక సింగిల్ ఇంజిన్ విమానం.. నెమ్మదిగా ఆ రోడ్డుపై ల్యాండయింది. అది చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విమానం నడుపుతున్న విసెంట్ ఫ్రేజర్ అనే వ్యక్తి మాజీ మరీన్. ప్రయాణంలో ఉండగా ఆ చిన్న విమానం ఇంజిన్ ఫెయిలైంది. దీంతో దాన్ని రోడ్డుపై ఎమర్జెన్సీగా దింపేయాలని ఫ్రేజర్ నిర్ణయించుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న కార్లు, ఎత్తుగా ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్లను త్రుటిలో తప్పించుకుంటూ చాకచక్యంగా విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేశాడు.

 

Video ThumbnailPlay icon

Trending News