India vs New Zealand: గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఉప్పల్ స్టేడియం నిర్వహకులు తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు.
India vs New Zealand: గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఉప్పల్ స్టేడియం నిర్వహకులు తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు జనవరి 13 నుంచి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుంచి 18 వరకు కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39వేల112 అయితే, 9వేల695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29వేల 417 టికెట్స్ ఆన్‌లైన్‌లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు.