Dr Santosh Kumar Kraleti: వైద్య సహాయమే పరమావధిగా భావించే డా సంతోష్ కుమార్‌కి జీ తెలుగు న్యూస్ అవార్డు

Dr Santosh Kumar Kraleti: డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ క్రాలేటి. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మెంబర్‌. ధాత్రి సీఎల్‌ఎంసీ, మిల్క్‌ బ్యాంక్స్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌. గ్లోబల్‌ ఇల్యూమిన్‌ ఫౌండేషన్‌, సుషేనా హెల్త్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు. సోషల్ అండ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌లో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఆయన సొంతం. ఒడిశా సూపర్ సైక్లోన్, సునామీ సమయంలో స్వచ్ఛందంగా సేవలందించారు.

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 01:53 AM IST

Dr Santosh Kumar Kraleti: కరోనా సమయంలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. హెల్త్‌కేర్ క్వాలిటీ, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇనిషియేటివ్స్, హెల్త్ పాలసీ వంటి అంశాలపై వివిధ ఫోరమ్‌ల కోసం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి 15కు పైగా దేశాల్లో పర్యటించారు డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ క్రాలేటి.  నవజాత శిశువులకు తల్లిపాల కొరతను నివారించడానికి సేఫ్ కేర్ సేవింగ్ లైవ్స్ అనే నినాదంతో ఆరోగ్యశ్రీ కింద ధాత్రి చైన్‌ ఆఫ్‌ మిల్స్‌ బ్యాంక్స్‌ను ప్రారంభించారు. వెయ్యి మందికి పైగా స్టాఫ్ నర్సులకు ల్యాక్టేషన్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చారు. ఒక్క నీలోఫర్‌లోని ధాత్రి కేంద్రమే 35వేలకు పైగా తల్లులకు 13వేల నవజాత శిశువులకు సేవలందించింది

Video ThumbnailPlay icon

Trending News