Munugode Protest:నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేయడానికి వస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. నెల రోజులుగా నిరసన తెలుపుతున్న చర్లగూడెం భూ నిర్వాసితులు.. ఇవాళ మునుగోడులో ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మునుగోడు వస్తున్న బాధితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.